విజయ్ దేవరకొండకు తండ్రి వార్నింగ్? ఇప్పటికైనా...

By Surya PrakashFirst Published May 4, 2020, 9:34 AM IST
Highlights

 ఆన్ లైన్ బిజినెస్, ఛారిటీ, ఇప్పుడు దేవరకొండ ఫౌండేషన్ ఇలా ఎప్పటికప్పుడూ ఏదో ఒకటి పెడుతూ వార్తలకెక్కుతున్నాడు. ఆయన చేసే పనులు చాలా భాగం పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్సే తెచ్చుకుంటున్నాయి. అయితే కొన్నిటికి మాత్రం ట్రోలింగ్ కు గురి అవుతున్నారు. 


అర్జున్ రెడ్డి చిత్రం పెద్ద హిట్టయ్యాక విజయ్ దేవరకొండ యాక్టివిటీస్ పూర్తిగా మారిపోయాయి. ప్రతీ విషయంలోనూ ఆయన న్యూస్ లో ఉంటూ వస్తున్నారు. ఆన్ లైన్ బిజినెస్, ఛారిటీ, ఇప్పుడు దేవరకొండ ఫౌండేషన్ ఇలా ఎప్పటికప్పుడూ ఏదో ఒకటి పెడుతూ వార్తలకెక్కుతున్నాడు. ఆయన చేసే పనులు చాలా భాగం పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్సే తెచ్చుకుంటున్నాయి. అయితే కొన్నిటికి మాత్రం ట్రోలింగ్ కు గురి అవుతున్నారు. తన సొంత డబ్బు ఖర్చు పెట్టి చేసే సేవా కార్యక్రమాలకు సైతం ఆయన ట్రోలింగ్ కు గురి అవ్వటం...విజయ్ సన్నిహితులకు, స్నేహితులకు,ముఖ్యంగా కుటుంబానికి బాధ కలిగిస్తోందిట. 

అప్పటికీ విజయ్ దేవరకొండ తండ్రి...కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని,ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెట్టద్దు, భవిష్యత్ కు కొంత దాచుకోమని హెచ్చరికగా చెప్పారట. ఈ విషయం విజయ్ ఓ ఇంటర్వూలో స్వయంగా చెప్పారు. అయితే తనకు ఎలా సంపాదించాలో, ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు అని సమాధానం ఇచ్చానని విజయ్ అన్నారు. ఏదైమైనా విజయ్ ఈ జనరేషన్ కుర్రాడు. ముఖ్యంగా తెలివైనవాడు. నటన తెలిసిన వాడు. భవిష్యత్ లో మరింతగా నిలదొక్కుకోబోయేవాడు. కాబట్టి అతని ధైర్యం అతనికి ఉంటుంది. తల్లి,తండ్రుల భయం వాళ్లకు ఉంటుంది. 

ప్రస్తుతం పూరి జగన్నాథ్ తాజా చిత్రం  ‘ఫైటర్‌’ లో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు వరల్డ్ ఫేమస్ లవర్ వంటి డిజాస్టర్ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావటంతో ... ఈ సినిమాతో విజయ్ తిరిగి ఫామ్ లోకి వస్తాడా...వచ్చేందుకు అవకాసం ఉందా అనే లెక్కలు వేస్తున్నారు. పూరి జగన్నాథ్ కథలు అయితే బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయి. లేదా డిజాస్టర్స్ అవుతాయి. ఇస్మార్ట్ శంకర్ తో వరస ఫ్లాఫ్ ల నుంచి బయిటపడ్డ ఆయన ఎలాగైనా మరో హిట్ ని సొంతం చేసుకోవాలనే ఊపులో ఉన్నారు. 

పూరీ కనెక్ట్స్‌, పూరీ జగన్నాథ్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో  తెరకెక్కస్తున్న చిత్రం ‘ఫైటర్‌’. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. జనవరి 13న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. ఎక్కువ శాతం షూటింగ్‌ ముంబైలోనే జరిగేలా ప్లాన్ చేసారు.
 

click me!