Tollywood Drugs Case: ముగిసిన కెల్విన్‌ విచారణ.. రూ.30 లక్షలపై ఆరా

By Siva KodatiFirst Published Sep 7, 2021, 10:12 PM IST
Highlights

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ విచారణ పూర్తయ్యింది. కెల్విన్‌ను ఈడీ కార్యాలయం నుంచి పంపించివేశారు అధికారులు. సుమారు 6 గంటల పాటు కెల్విన్‌ను ప్రశ్నించారు ఈడీ అధికారులు.
 

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ విచారణ పూర్తయ్యింది. కెల్విన్‌ను ఈడీ కార్యాలయం నుంచి పంపించివేశారు అధికారులు. సుమారు 6 గంటల పాటు కెల్విన్‌ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో ఈడీ అధికారులు కెల్విన్, వాహబ్, ఖుద్దూస్‌ల ఇంటికి వెళ్లారు. ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కెల్విన్, వాహబ్, ఖుద్దూస్‌లను అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు.

Also Read:టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ముగిసిన నందు విచారణ.. ఇంకా ఈడీ కస్టడీలోనే కెల్విన్

ముగ్గురి బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. వీరి ఖాతాలోకి ఇతరుల ఖాతాల నుంచి భారీగా నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి.. ఎవరు పంపించారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్సైజ్ సిట్ అధికారుల దర్యాప్తు కూడా కెల్విన్ కేంద్రంగానే కొనసాగింది. 2017 జూలై నెలలో కెల్విన్‌ను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి రూ.30 లక్షలు విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అతని సెల్‌ఫోన్‌లోని కాంటాక్ట్  నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ కేసులో దగ్గుబాటి రానా రేపు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

click me!