డ్రగ్స్ కేసు: రేపటి నుండే విచారణ, డైరెక్టర్ పూరితో మొదలు!

By team teluguFirst Published Aug 30, 2021, 3:46 PM IST
Highlights

పూరి జగన్నాధ్, రవితేజ, నవదీప్, తరుణ్, ఛార్మి, రానా, రకుల్, నందు,మొమైత్ ఖాన్, తనీష్ లతో పాటు రవితేజ డ్రైవర్, ఎఫ్ క్లబ్ ఓవర్ మొత్తం 12మందిని, ఈనెల 31నుండి సెప్టెంబర్ 22వరకు వరుసగా విచారించనున్నారు.


సినీతారల డ్రగ్స్ కేసు లో రేపటి నుంచి విచారణ ప్రారంభంకానుంది. రేపు ఈడీ ముందు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హాజరుకానున్నారు. ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ 62 మందిని విచారించింది. డ్రగ్స్‌ కేసులో లబ్ధిదారుల అక్రమాస్తుల జప్తు దిశగా ఈడీ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
 

పూరి జగన్నాధ్, రవితేజ, నవదీప్, తరుణ్, ఛార్మి, రానా, రకుల్, నందు,మొమైత్ ఖాన్, తనీష్ లతో పాటు రవితేజ డ్రైవర్, ఎఫ్ క్లబ్ ఓవర్ మొత్తం 12మందిని, ఈనెల 31నుండి సెప్టెంబర్ 22వరకు వరుసగా విచారించనున్నారు.  విదేశాలకు నిధుల తరలింపుపై వీరిని ఈడీ విచారించనుంది. వీరి విచారణ పూర్తి అయిన అనంతరం మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం కలదు.   

ఇప్పటికే కోర్టులో ఎన్‌ఫోర్స్ మెంట్ క్రైం ఇన్ఫర్మేషన్ రిపోర్టు దాఖలు చేశారు ఈడీ అధికారులు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ సెక్షన్ 3,4 కింద కేసులు నమోదయ్యాయి. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తి్స్తే ఫెమా కేసులు నమోదు చేసే యోచనలో ఈడీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖులు ఇన్వాల్వ్ కావడంతో ఈ కేసు ఏ మలుపుతిరుగుతుందో అన్న ఆసక్తి నెలకొని ఉంది. 


 

click me!