టాలీవుడ్ డ్రగ్స్ కేసు: పూరి జగన్నాథ్‌పై ఈడీ ప్రశ్నల వర్షం.. 2015 నాటి బ్యాంక్ లావాదేవీలపై ఆరా

By Siva KodatiFirst Published Aug 31, 2021, 3:14 PM IST
Highlights

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్‌ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా 2015 నుంచి ట్రాన్సాక్షన్స్‌పై ఆరా తీస్తున్నారు
 

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్‌ను ఐదు గంటలుగా ప్రశ్నిస్తోంది ఈడీ. భోజన విరామం తర్వాత పూరిని ప్రశ్నిస్తున్నారు అధికారులు. సాయంత్రం 6గంటల వరకు ఆయనను విచారించే అవకాశం వుంది. పూరి జగన్నాథ్ బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్న అధికారులు.. 2015 నుంచి ట్రాన్సాక్షన్స్‌పై ఆరా తీస్తున్నారు. ఛార్టెట్ ఎకౌంటెంట్ సమక్షంలో బ్యాంకు ఖాతాల లావాదేవీలను అధికారులకు వివరిస్తున్నారు పూరి. ముఖ్యంగా విదేశీ లావాదేవీలపైనే ఈడీ అధికారులు దృష్టి సారించారు. మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై కూపీ లాగుతున్నారు. మీకు డ్రగ్స్ ఎవరు అందించారు..? డ్రగ్స్ ఇచ్చినందుకు మీరు ఎంత డబ్బు ఇచ్చారు.. ? అంటూ పూరి జగన్నాథ్‌పై ఈడీ ప్రశ్నలు వేస్తోంది. 

ALso Read:డ్రగ్స్ కేసు: రేపటి నుండే విచారణ, డైరెక్టర్ పూరితో మొదలు!

కాగా, ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ 62 మందిని విచారించింది. డ్రగ్స్‌ కేసులో లబ్ధిదారుల అక్రమాస్తుల జప్తు దిశగా ఈడీ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాధ్, రవితేజ, నవదీప్, తరుణ్, ఛార్మి, రానా, రకుల్, నందు,మొమైత్ ఖాన్, తనీష్ లతో పాటు రవితేజ డ్రైవర్, ఎఫ్ క్లబ్ ఓవర్ మొత్తం 12మందిని, ఈనెల 31నుండి సెప్టెంబర్ 22వరకు వరుసగా విచారించనున్నారు.  విదేశాలకు నిధుల తరలింపుపై వీరిని ఈడీ విచారించనుంది. వీరి విచారణ పూర్తి అయిన అనంతరం మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం కలదు.   

click me!