డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల విచారణ రేపటి నుంచే..పూరీ ఫస్ట్

First Published Jul 18, 2017, 2:19 PM IST
Highlights
  • గత రెెండు వారాలుగా టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్ స్కాండల్
  • డ్రగ్స్ స్కామ్ లో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు నోటీసులు
  • రేపటి నుంచి విచారణకు హాజరు కావాలని ఎక్సైజ్ శాఖ ఆదేశం
  • పూరీజగన్నాథ్ విచారణ రేపే.. హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్

గత వారం రోజులుగా తెలుగు ప్రజలను ఉలికిపాటుకు గురిచేసిన డ్రగ్స్ మాఫియా అంశం తాజాగా టాలీవుడ్ కూ పాకడంతో సంచలనం సృష్టిస్తోంది.ఈ కేసులో ఫోన్ నంబర్లు, కాల్ డేటా ఆధారంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ నియమించిన సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది.

 

తాజాగా డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో రవితేజ, హీరోయిన్ ఛార్మి, ఐటమ్ గాళ్ ముమైత్ ఖాన్, హీరోలు తరుణ్, నవదీప్,తనీష్, సుబ్బరాజు, నందు తదితరులతోపాటు సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, శ్రీనివాసరావులకు నోటీసులు అందాయి.

 

ఇక ఈ నెల 19 నుంచి ఆగస్టు 2 వరకు విచారణ కొనసాగుతుందని, నోటీసులు అందిన వారు స్వయంగా విచారణకు హాజరు కావాల్సిందేనని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ డాక్టర్ అకున్ సభర్వాల్ స్పష్టం చేశారు. విచారణకు హాజరు కాకుంటే కఠిన చర్యలు తప్పవని అకున్ సభర్వాల్ తేల్చి చెప్పారు.

విచారణ తేదీలు హాజరు కావాల్సిన సినీ ప్రముఖుల వివరాలు ఇలా ఉన్నాయి.

19th – పూరీ జగన్నాథ్, 20th – ఛార్మి, 21st – ముమైత్ ఖాన్, 22nd – సుబ్బరాజు, 23rd – శ్యామ్ కె నాయుడు, 24th – రవితేజ, 25th – ఆర్డ్ డైరెక్టర్ చిన్నా, 26th – నవదీప్, 27th – తరుణ్, 28th – నందు, 29th – తనీష్

click me!