హీరో సూర్యకు గాయాలు.. అభిమానుల్లో ఆందోళన

By Satish ReddyFirst Published May 27, 2020, 11:16 AM IST
Highlights

ప్రస్తుతం ఇంటికే పరిమితమైన సూర్య వర్క్ అవుట్ చేస్తుండగా గాయపడ్డాడట. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ కావటంతో అభిమానుల్లో ఆదోళన చెందుతున్నారు. తమ అభిమాన నటుడికి ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆరాలు తీయటం మొదలు పెట్టారు.

ప్రస్తుతం కరోనా కారణం లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో సినీ పరిశ్రమకు చెందిన అంతా ఇంటికే పరిమితమయ్యారు. సాంకేతిక నిపుణులతో పాటు నటీనటులు కూడా ఇళ్లకే పరిమిత మయ్యారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గాయపడినట్టుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సురారై పొట్రు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన పొన్‌మగళ్‌ వందాళ్‌ సినిమా నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ లో రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్నాడు.

ప్రస్తుతం ఇంటికే పరిమితమైన సూర్య వర్క్ అవుట్ చేస్తుండగా గాయపడ్డాడట. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ కావటంతో అభిమానుల్లో ఆదోళన చెందుతున్నారు. తమ అభిమాన నటుడికి ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆరాలు తీయటం మొదలు పెట్టారు. అయితే ఈ వార్తలపై సూర్య సన్నిహితులు స్పందించారు. అభిమానులు ఆందోళన చెందాల్సినంతగా ఏం జరగలేదట. వర్క్‌ అవుట్స్ చేస్తుండగా సూర్య ఎడమ చేతికి చిన్న గాయమైందని వారు పేర్కొన్నారు.

వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారని, ప్రస్తుతం గాయం నయమైందని వెల్లడించారు. ఇక చిత్ర షూటింగ్ లకు అనుమతించిన వెంటనే షూటింగ్‌లకు హాజరయ్యేందుకు సూర్య సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సురారై పొట్రు సినిమాను పూర్తి చేయటంతో పాటు తనకు సింగం లాంటి సూపర్‌ హిట్ సిరీస్‌లను అందించిన హరి దర్శకత్వంలో అరువా పేరుతో మరో సినిమాను  చేసేందుకు రెడీ అవుతున్నాడు. 

click me!