తమన్నా హెల్త్ కండీషన్ పై అఫీషియల్ ప్రకటన

Surya Prakash   | Asianet News
Published : Oct 06, 2020, 08:05 AM IST
తమన్నా హెల్త్ కండీషన్ పై అఫీషియల్ ప్రకటన

సారాంశం

సెట్‌లో తమ బృందం జాగ్రత్తలు పాటిస్తూ, నిబద్ధతతోనే ఉన్నామని తమన్నా తెలిపారు. అయినప్పటికీ గత వారం తనకు స్వల్పంగా జ్వరం వచ్చిందని, దీంతో పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. 


 తమన్నా  కరోనాతో తో బాధపడుతున్నట్లు ఆదివారం తెలిసింది. ఈ నేపథ్యంలో అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. దీంతో తమన్నా తన ఆరోగ్యం గురించి కంగారు వద్దంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో  తమన్నా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారనే విషయం ఆమే స్వయంగా వెల్లడించారు.  వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు చెప్పారు. తను కోలుకోవాలని ప్రార్థించిన వారికి, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
 
ఇక తాను షూటింగ్‌లో ఉన్నపుడు సెట్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. అయినా కూడా ఎందుకో జ్వరం వస్తే టెస్ట్ చేయించుకున్నానని తెలిపింది. దాంతో కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపింది తమన్నా. వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి.. వైద్యుల సలహాతో చికిత్స తీసుకున్నానని చెప్పింది తమన్నా. ఇప్పుడు తాను అంతా బాగున్నానని తెలిపింది ఈ మిల్కీ బ్యూటీ. తనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు తమన్నా తెలిపింది. ప్రపంచంలోని చాలా మంది కరోనాతో ఇబ్బంది పడుతుండగా.. తను పూర్తిగా కోలుకోవడం అదృష్టమే అని తెలిపింది తమన్నా.

ఇక  తమన్నా ఈ ఏడాది ప్రారంభంలో ‘సరిలేరు నీకెవ్వరు’లోని స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేశారు. ఆమె నటించిన ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’ విడుదలకు సిద్ధమౌతోంది. ‘బోలె చుడియన్‌’ అనే హిందీ ప్రాజెక్టుకు కూడా సైన్ చేశారు. తెలుగులో గోపీచంద్‌తో కలిసి ‘సీటీమార్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దిగంగన, భూమిక, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, అజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో వైపు  తమన్నా చేతిలో గుర్తుందా శీతాకాలం, సిటీమార్, అంధధూన్ రీమేక్‌తో‌ పాటు ఓ వెబ్‌ సిరీస్ ఉన్నాయి. ఇందులో సిటీమార్ చిత్రం నవంబర్  నుంచి పునః ప్రారంభం కావాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?