మనుషులుగా జీవించటం మళ్లీ నేర్చుకోవాలి: తమన్నా

By Satish ReddyFirst Published Jun 5, 2020, 6:00 PM IST
Highlights

అమెరికాలో నల్లజాతీయుడు హత్య, కేరళలో గర్బంతో ఉన్న ఏనుగు హత్య లాంటి అంశాలపై సెలబ్రిటీలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మిల్కీ బ్యూటీ తమన్నా కూడా స్పందించింది.

ఇటీవల ప్రపంచాన్ని రెండు దారుణ సంఘటనలు కుదిపేస్తున్నాయి. అమెరికాలో నల్ల జాతీయుడైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ను ఓ తెల్ల  జాతీ పోలీస్‌ దారుణంగా గొంతు నులిమి చపటం, తరువాత కేరళ రాష్ట్రంలో గర్భంతో ఉన్న ఓ ఏనుగుకు కొంత మంది ఆకతాయిలు కారణం కావటం. ఈ రెండు సంఘటనలు ప్రపంచ దేశాల్ని కుదిపేస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సంఘటనల మీద తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.

మనుషుల్లో మానవత్వం నశించిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై హీరోయిన్‌ తమన్నా కూడా స్పందించింది. ఓ బ్లాక్ అండ్ వైట్‌ ఫోటోను ట్వీట్ చేసిన తమన్నా. ఇలాంటి దారుణమైన సంఘటనల మీద ప్రతీ ఒక్కరు స్పందించాలంటూ తనదైన స్టైల్‌లో స్టేట్‌మెంట్ ఇచ్చింది.

`నీ నిశ్శబ్దం నిన్ను కాపాడదు. ప్రతీ ప్రాణం ముఖ్యమే కదా.. మనిషైనా.. జంతువైనా..? మనం మారాల్సిన సమయమిది. మనిషిగా జీవించటం మళ్లీ నేర్చుకోవాలి. ప్రేమభావన అలవరుచుకోండి` అంటూ కామెంట్ చేసింది. ఈ విషయంలో సోషల్ మీడియా ఫాలోవర్స్‌ కూడా తమన్నాకు మద్దతు తెలుపుతున్నారు.

Your silence will not protect you. Doesn't every life matter, human or animal? Muting any form of creation is against the universal law. We must unlearn and learn to be human again, express compassion and practice love. pic.twitter.com/Ixzq39ueJC

— Tamannaah Bhatia (@tamannaahspeaks)
click me!