కోల్‌కతా ఇంటర్‌లో సన్నీలియోన్‌ టాప్‌.. షాక్‌లో ఇంటర్‌బోర్డ్

By Aithagoni RajuFirst Published Aug 28, 2020, 8:20 PM IST
Highlights

కోల్‌కతాలోని అషుతోష్‌ అనే ఇంటర్మీడియట్‌ కాలేజ్‌లో ఇంటర్‌సెకండ్‌ ఇయర్‌ బోర్డ్ పరీక్షల మెరిట్‌ జాబితాలో సన్నీలియోన్‌ పేరు టాప్‌ ప్లేస్‌లో ఉంది. 

మాజీ పోర్న్ స్టార్‌ సన్నీ లియోన్‌ కాలేజ్‌కి వెళ్తుంది. ఇంకా ఇంటర్మీడియటే చదువుతోంది. అది ముంబయిలో కాదు, కోల్‌కతాకి వెళ్ళి మరీ చదువుకుంటోంది. అంతటితే ఆగలేదు.. ఏకంగా తాను చదివే కాలేజీలో ఫస్ట్ ర్యాంక్‌ సాధించింది. అత్యధిక మార్కులు సాధించి కోల్ కత్తా ప్రజలకు, ఇంటర్మీడియట్‌ బోర్డ్ కే కాదు, ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 

మరి మొన్నటి వరకు పోర్న్ సినిమాలతో రెండు చేతులా సంపాదించి, ఇప్పుడు బాలీవుడ్‌ సినిమాల్లో మెరుస్తున్న సన్నీ లియోన్‌ ఇంకా ఇంటర్‌ చదవడమేంటి? అయినా ఫస్ట్ ర్యాంక్‌ రావడమేంటి? అనే అనుమానాలు కలుగుతాయి. ఆ వివరాలు చూస్తే.. అందరూ షాక్‌ అవుతారు. ముక్కున వేలేసుకుంటున్నారు. కోల్‌కతాలోని ఆ కాలేజ్‌ యాజమాన్యానికి రెండు చేతులు జోడించి దెండం పెడతారు. 

మరి ఆ వివరాల్లోకి వెళ్లితే.. కోల్‌కతాలోని అషుతోష్‌ అనే ఇంటర్మీడియట్‌ కాలేజ్‌లో ఇంటర్‌సెకండ్‌ ఇయర్‌ బోర్డ్ పరీక్షల మెరిట్‌ జాబితాలో సన్నీలియోన్‌ పేరు టాప్‌ ప్లేస్‌లో ఉంది. అమె రోల్‌ నెంబర్‌, అప్లికేషన్‌ ఐడీ, ఆమెకి వచ్చిన మార్కుల జాబితాను కూడా ఈ లిస్ట్ లో మెన్షన్‌ చేశారు. అందులో నాలుగు సబ్జెక్ట్ ల్లో వందకు వంద మార్కులు రావడం విశేషం. 

అంతేకాదు ఏకంగా సన్నీ లియోనే ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకోవడం మరో విశేషం. `కాలేజ్‌ నెక్ట్స్ సెమిస్టర్‌లో మీ అందరినీ కలుసుకుంటా. మీరంతా నా క్లాస్‌లో ఉంటారని భావిస్తున్నా` అని సెటైర్‌ వేసింది. దీంతో ఈ విషయం తెలిసి అంతా అవాక్కయ్యారు. అంతేకాదు కాస్త లేట్‌గా జరిగిన మిస్టేక్‌ని తెలుసుకుని యాజమాన్యం తప్పుని సరిదిద్దుకునే పనిలో పడింది. 

See you all in college next semester!!! Hope your in my class ;) 😆😜

— sunnyleone (@SunnyLeone)

కావాలని ఎవరో ఆకతాయులు చేసిన పనిగా చెబుతూ, విచారణకు ఆదేశించింది కాలేజ్‌ యాజమాన్యం. దీనిపై చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్‌ బోర్డ్ తెలిపింది. మొత్తంగా ఎడ్యూకేషన్‌ విధానంలో ఉన్న లోపాలను, అవి ఎంత దారుణంగా ఉందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణగా నిలిచిందని చెప్పొచ్చు. 
 

click me!