బాలు అత్యధికంగా జాతీయ అవార్డ్స్ ఎన్నిసార్లు అందుకున్నారంటే..!

By Satish ReddyFirst Published Sep 25, 2020, 2:08 PM IST
Highlights
భారత చలనచిత్ర చరిత్రలో తన పాటలతో ఘన చరిత్ర లిఖించిన బాలు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు పలుమార్లు అందుకున్నారు. బాలు జాతీయ అవార్డ్స్ ఏఏ చిత్రాలకు అందుకున్నారంటే...

బాలు పాటలతో ప్రేక్షకులకు ఐదు దశాబ్దాలకు పైగా అనుబంధం. ఆయన పాటలు బాలును ప్రతి ఒక్కరి ఇంటిలో ఒకడిగా చేశాయి. బాలు అంటే మనవాడనే భావన ఆయన పాటలను ఆరాధించే ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అలాంటి బాలుగారు లేరంటే జీర్ణించుకోవడం అంత సులభం కాదు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ అనే పుస్తకంలో బాలు ఘనమైన అధ్యాయం రచించారు. 16భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన బాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకున్నారు.

Also Read:బాలు అత్యధికంగా జాతీయ అవార్డ్స్ ఎన్నిసార్లు అందుకున్నారంటే..!
 
అత్యంత గౌరవంగా భావించే జాతీయ అవార్డు బాలుగారు అత్యధికంగా ఆరుసార్లు అందుకున్నారు. మూడు తెలుగు పాటలకు. ఒక హిందీ, కన్నడ మరియు తమిళ పాటకు బాలు జాతీయ అవార్డు గెలుపొందడం జరిగింది. 1979లో వచ్చిన చిత్రరాజం శంకరాభరణం మూవీ కోసం బాలు పాడిన 'ఓంకార నాధాను' అనే పాటకు మొదటిసారి జాతీయ అవార్డు గెలుపొందారు. 

Also Read:ఎంజీఎం ఆసుపత్రికి భారీగా తరలి వస్తోన్న ఫ్యాన్స్ .. అంత్యక్రియలు అక్కడే

ఆ తరువాత రెండేళ్లకు 1981లో విడుదలైన హిందీ చిత్రం ఏక్ తుజే కేలియే చిత్రంలో తేరే మేరె బీచ్ మే సాంగ్ ఆలపించగా ఆ పాటకు సైతం బాలు నేషనల్ అవార్డు పొందడం జరిగింది. 1983లో వచ్చిన సాగరసంగమం మూవీలో బాలు ఆలపించిన వేదం అణువణున నాదం సాంగ్ కి గానూ మూడవ జాతీయ అవార్డు గెలుపొందారు. 

Also Read:ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాణం ఆ మిత్రుడే

చిరంజీవి హీరోగా 1988లో విడుదలైన రుద్రవీణ సినిమాలో బాలు పాడిన చెప్పాలని ఉంది సాంగ్ కి  బాలు జాతీయ అవార్డ్ గెలుపొందారు. 1995లో కన్నడ పాటకు, 1996లో తమిళ పాటకు బాలు జాతీయ అవార్డ్స్ గెలుపొందారు. ఇండియన్ మేల్ సింగర్స్ లో ఆరుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ఇద్దరిలో బాలు ఒకరు. మరొక సింగర్ గా జేసుదాసు ఉన్నారు. అలాగే బాలు 8 నంది అవార్డ్స్, 6 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ గెలుపొందారు. 

Also Read:

ఎస్బీ బాలు మొండి ఘటమే: సూపర్ స్టార్ కృష్ణతో వివాదం

బాలు గాత్రం నుంచి జాలువారిన ఎవర్‌గ్రీన్‌ సాంగ్స్

సంగీత శిఖరం మూగబోయింది.. పాట సెలవ్‌ తీసుకుంది

ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం ముద్దు పేరేమిటో తెలుసా.....

ఎస్పీ బాలుది రుక్మిణీ కల్యాణం: ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు

బాలసుబ్రహ్మణ్యం స్మోక్ చేసేవారు: కూతురి ఒక్క మాటతో...

గాన గాంధర్వుడి అరుదైన చిత్రమాలిక.. ఎప్పుడూ చూసి ఉండరు!

 

click me!