ఎస్బీ బాలు మొండి ఘటమే: సూపర్ స్టార్ కృష్ణతో వివాదం

Published : Sep 25, 2020, 02:07 PM ISTUpdated : Sep 25, 2020, 02:35 PM IST
ఎస్బీ బాలు మొండి ఘటమే: సూపర్ స్టార్ కృష్ణతో వివాదం

సారాంశం

సూపర్ స్టార్ కృష్ణతో ఆయనకు ఓ సందర్భంలో వివాదం చోటు చేసుకుంది. దాంతో కృష్ణ సినిమాలకు పాటలు పాడడమే మానేశారు.

ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం మాటంటే మాటే అన్నట్లుండేవారు. సూపర్ స్టార్ కృష్ణతో ఆయనకు ఓ సందర్భంలో వివాదం చోటు చేసుకుంది. దాంతో కృష్ణ సినిమాలకు పాటలు పాడడమే మానేశారు. కృష్ణ కఠినంగా మాట్లాడడంతో ఆ పనిచేశాడు. కృష్ణ ప్రస్తుత సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి అనే విషయం తెలిసిందే. 

Also Read:బాలు అత్యధికంగా జాతీయ అవార్డ్స్ ఎన్నిసార్లు అందుకున్నారంటే..!

పాటలు పాడడం మానేసిప్పటికీ బాలు, కృష్ణ బయట కలిసినప్పుడు మామూలుగానే మాట్లాడుకునేవారు. మహేష్ బాబు కోసం బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు శైలజ ఓ పాట పాడింది. బాలుతో కృష్ణ ఆ విషయం ప్రస్తావిస్తూ ఆ పాటను వినిపించారట. 

Also Read:ఎంజీఎం ఆసుపత్రికి భారీగా తరలి వస్తోన్న ఫ్యాన్స్ .. అంత్యక్రియలు అక్కడే

ఇరువురి మధ్య సయోధ్య కుదర్చడానికి చాలా మందే ప్రయత్నించారు. కానీ, బాలు అసలు ఒప్పుకోలేదు. రాజ్ కోటీ, వేటూరి సుందరరామ్మూర్తి ఎస్బీ బాలుకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఆయన వినలేదు. 

Also Read:ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాణం ఆ మిత్రుడే

అయితే, అకస్మాత్తుగా ఓ రోజు బాలు కృష్ణకు చెందిన పద్మాలయ స్టూడియోకు వెళ్లారు. స్టాఫ్ అంతా బిత్తరపోయి చూస్తూ ఉంటే కృష్ణ వద్దకు వెళ్లారు. బాలును కృృష్ణ సాదరంగా ఆహ్వానించారు. ఇరువురు కూడా మామూలుగానే మాట్లాడుకున్నారు. బాలు వివాదానికి కారణమైన విషయం గురించి వివరణ ఇవ్వాలని అనుకున్నారు. కానీ, కృష్ణ అవేవీ వద్దు, కలిసి పనిచేద్దామని చెప్పారు. అప్పటి నుంచి కృష్ణకు ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం తిరిగి పాడడం ప్రారంభించారు. 

Also Read:ఎస్బీ బాలు మొండి ఘటమే: సూపర్ స్టార్ కృష్ణతో వివాదం

మోహన్ బాబు సినిమాలకు పాడడానికి కూడా ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం నిరాకరిస్తూ వచ్చారు. మోహన్ బాబు సినిమాల్లో జేసుదాసు పాడుతూ వచ్చారు. ఎస్బీ బాలు మోహన్ బాబుకు పాడడం నిరాకరించారనే విషయం చాలా మందికి తెలియదు.

Also Read:

బాలు గాత్రం నుంచి జాలువారిన ఎవర్‌గ్రీన్‌ సాంగ్స్

సంగీత శిఖరం మూగబోయింది.. పాట సెలవ్‌ తీసుకుంది

ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం ముద్దు పేరేమిటో తెలుసా.....

ఎస్పీ బాలుది రుక్మిణీ కల్యాణం: ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు

బాలసుబ్రహ్మణ్యం స్మోక్ చేసేవారు: కూతురి ఒక్క మాటతో...

గాన గాంధర్వుడి అరుదైన చిత్రమాలిక.. ఎప్పుడూ చూసి ఉండరు!

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?