అద్భుత నటనకు ఆరు నంది పురస్కారాలు

By Aithagoni RajuFirst Published Sep 8, 2020, 2:56 PM IST
Highlights

మూడున్నర దశాబ్దాల నటన జీవితంలో ప్రముఖ నటుడు జయప్రకాష్‌ రెడ్డి పలు అవార్డులను  అందుకున్నారు. అందులో ముఖ్యంగా ఆరు నంది అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. 

మూడున్నర దశాబ్దాల నటన జీవితంలో ప్రముఖ నటుడు జయప్రకాష్‌ రెడ్డి పలు అవార్డులను అందుకున్నారు. అందులో ముఖ్యంగా ఆరు నంది అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. అయితే సినిమా నటుడిగా ఆయనకు ఒకే ఒక నంది అవార్డు వచ్చింది. అది `జయం మనదేరా` చిత్రానికి, ఉత్తమ విలన్‌గా నంది పురస్కారం అందుకున్నారు. ఇక నటకాల్లో మాత్రం ఆయనకు అవార్డుల పంట పండిందనే చెప్పాలి. ఏకంగా ఐదు నంది పురస్కారాలను సొంతం చేసుకున్నారు. 

ఫ్యాక్షనిస్ట్ విలన్‌గా `సమరసింహారెడ్డి` తనకు అద్బుతమైన గుర్తింపు తెచ్చిందని, ఆ సినిమా నా పాత్ర వల్లే యాభై రోజులు ఎక్కువ ఆడిందని ఫోన్‌ చేసి మరీ నిర్మాతలు చెప్పడం చాలా ఆనందమేసిందన్నారు. ఆ  చిత్రాన్ని 125వ రోజు చూశాడట. 

ఇక తన నట జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో జయప్రకాష్‌ రెడ్డి చెబుతూ, `సినిమా రంగంలో ఫ్యాక్షనిజం  పాత్రల నుంచి టర్నింగ్‌ పాయింట్‌ ఇచ్చిన చిత్రం `ఢీ` అన్నారు. శ్రీనువైట్ల ఒత్తిడి చేసి మరీ ఈ పాత్ర చేయించారని, విడుదలయ్యాక దాని విలువేంటో తెలిసిందన్నారు. 

తనకు రాయలసీమ యాస తప్ప మరేది రాదనే స్థితి ఒకానొక దశలో అనుకున్నారట. దాన్నుంచి బయటపడాలని తెలంగాణ యాసని కూడా బాగా స్టడీ చేశారట. అలాగే నెల్లూరి యాసని కూడా పట్టుకున్నట్టు తెలిపారు. ఇలా పాత్ర కోసం పలు యాసలపై ఫోకస్‌ పెట్టి వాటిపై పట్టుసాధించానని తెలిపారు.

బాలకృష్ణతో అనుబంధాన్ని పంచుకుంటూ, `బాలయ్య చాలా సంస్కారవంతుడని తెలిపారు. సెట్‌లో ఒకే కూర్చి  ఉంటే, నేను సెట్‌కి రాగానే ఆయన లేచి గురువుగారు నమస్కారమన్నారట. `సమరసింహారెడ్డి` సినిమాలోని  విలన్‌ పాత్రకిగానూ నాకు అవార్డు రానందుకు బాలయ్య చాలా బాధపడ్డారని, ఆ విషయాన్ని తన పుట్టిన రోజు మీడియాలో వెల్లడించిన తనపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు.
 

click me!