వాళ్లను వదిలే ప్రసక్తి లేదు,పోరాటం చేస్తా

By Surya PrakashFirst Published Sep 21, 2020, 7:06 PM IST
Highlights

 హైదరాబాద్ మణికొండలోని మౌంట్ లీటేరాజీ స్కూల్.. తన పిల్లలను ఎలాంటి సమాచారం లేకుండా ఆన్ లైన్ క్లాసెస్ నుండి తొలిగించడంపై గతంలో హెచ్చార్సీకి ఫిర్యాదు చేసినట్లు శివబాలాజీ దంపతులు తెలిపారు. 


ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై సినీ నటుడు శివబాలాజీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కార్పొరేట్, ప్రయివేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఆన్ లైన్ క్లాసుల పేరుతో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని రంగారెడ్డి జిల్లా డీఈవోకు ఫిర్యాదు చేశాడు నటుడు శివ బాలాజీ.  హైదరాబాద్ మణికొండలోని మౌంట్ లీటేరాజీ స్కూల్.. తన పిల్లలను ఎలాంటి సమాచారం లేకుండా ఆన్ లైన్ క్లాసెస్ నుండి తొలిగించడంపై గతంలో హెచ్చార్సీకి ఫిర్యాదు చేసినట్లు శివబాలాజీ దంపతులు తెలిపారు. 

స్కూల్ యాజమాన్యం ఆన్ లైన్ క్లాసెస్ పేరుతో విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని… డీఈవో విజయలక్ష్మికి వివరించారు. పెంచిన స్కూల్ ఫీజలు తగ్గించాలని కోరితే తమకు ఎలాంటి సమాచారం లేకుండా… తమ పిల్లలను తొలగించారని చెప్పారు. తమలాగే అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

అలాగే   మౌంట్ లిటేరా జీ స్కూల్లో చదువుతున్న తన పిల్లలను ఎలాంటి కారణం లేకుండానే ఆన్ లైన్ క్లాసుల నుంచి తొలగించారంటూ ఆయన హెచ్చార్సీని ఆశ్రయించారు  ఆయనతో పాటు ఆయన భార్య మధుమిత కూడా వచ్చారు.

అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, హెచ్చార్సీ చాలా వేగంగా స్పందించిందని శివబాలాజీ కొనియాడారు. స్కూల్ నుంచి స్పందన వచ్చిందని, తమ పిల్లల ఆన్ లైన్ క్లాసులకు యాక్సెస్ ఇచ్చారని చెప్పారు. అయితే తమ పిల్లలను ఎందుకు తొలగించారో స్కూల్ యాజమాన్యం చెప్పాలని డిమాండ్ చేశారు.

 టెక్నికల్ సమస్య వల్ల అలా జరిగిందని స్కూల్ వాళ్లు చెపుతున్నారని అన్నారు. కానీ, కావాలనే ఇలా చేశారని, దానికి సంబంధించిన ఆధారాలను డీఈవోకి ఇచ్చామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరగకపోతే స్కూల్ లైసెన్స్ రద్దయ్యేంత వరకు పోరాడుతామని చెప్పారు. డీఈవోకు అన్ని విషయాలను వివరించామని తెలిపారు.

click me!