రాత్రిళ్లు ఫోన్ చేసి బూతులు తిట్టేవారు.. శేఖర్ మాస్టర్ కామెంట్స్!

By Udaya DFirst Published Mar 2, 2019, 10:22 AM IST
Highlights

సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు శేఖర్ మాస్టర్. డాన్సర్ గా సినిమాలు చేస్తూనే.. కొన్ని షోలకు జడ్జిగా  వ్యవహరిస్తున్నారు. 

సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు శేఖర్ మాస్టర్. డాన్సర్ గా సినిమాలు చేస్తూనే.. కొన్ని షోలకు జడ్జిగా  వ్యవహరిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబ నుండి వచ్చిన శేఖర్ మాస్టర్ ఈరోజు స్టార్ హీరోలు చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోల పాటలకు డాన్స్ కంపోజర్ గా మారడం వెనుక చాలా కష్టమే ఉందట.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ కి ఎదురైన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చాడు. డాన్సర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చిన శేఖర్ మాస్టర్ అవకాశాలు లేనప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పని చేసినట్లు చెప్పారు. అలా ఒకరోజు షూటింగ్ కి వెళ్తే రూ.75 వచ్చాయట.

వాటిని చూసి ఎంతో ఆనందపడినట్లు.. అదే తన తొలి సంపాదన అని వెల్లడించాడు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఒక మాస్టర్ ని ఎంతగానో అభిమానించేవాడినని(ఆయన పేరు చెప్పలేదు) చెప్పిన శేఖర్ మాస్టర్ ఆయన మీద ఇష్టంతో చేతిపై పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నట్లు చెప్పారు. అయితే ఆ మాస్టర్ మాత్రం తనపై అభాండాలు వేసినట్లు, రాత్రిళ్లు ఫోన్ చేసి బూతులు తిట్టేవారని చెప్పాడు.

మళ్లీ ఉదయాన్నే ఫోన్ చేసి రాత్రి తాగి ఉన్నా.. ఏం అనుకోవద్దని అనేవారని చెప్పాడు. ఒకరోజు ఇంటికి పిలిపించుకొని మరీ తిట్టారని, లైఫ్ లో మీ దగ్గరకి రాను మాస్టర్ అని చెప్పి వచ్చేసినట్లు గుర్తు చేసుకున్నాడు శేఖర్ మాస్టర్. 
 

click me!