యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ తో వచ్చిన మాచో గోపీచంద్... సీటీ గట్టిగానే మోగేలా ఉంది!

By team teluguFirst Published Aug 31, 2021, 3:28 PM IST
Highlights

దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన సీటీమార్ ట్రైలర్ నేడు విడుదల కావడంతో పాటు సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. సినిమా విడుదల దగ్గర పడుతుండగా, ప్రొమోషన్స్ జోరు పెంచారు  టీమ్.

యాక్షన్ హీరో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా నయా రోల్ ట్రై చేశారు. రోల్ కొత్తదైనా.. యాక్షన్ మాత్రం సేమ్ అన్న తీరుగా ఉంది. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన సీటీమార్ ట్రైలర్ నేడు విడుదల కావడంతో పాటు సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. సినిమా విడుదల దగ్గర పడుతుండగా, ప్రొమోషన్స్ జోరు పెంచారు  టీమ్. దీనిలో భాగంగా నేడు ట్రైలర్ విడుదల చేశారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన సీటీమార్ గోపీచంద్ మార్క్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. 


సీరియస్ లేడీ కబడ్డీ టీం కోచ్ గా గోపి చంద్ లుక్, మేనరిజం ఆకట్టుకున్నాయి. పల్లెల్లో ఉండే మూఢ నమ్మకాలు, పనికిరాని పద్ధతులు ఆడవాళ్ళ ఎదుగుదలకు ఎలా ఆటంకం కలిగిస్తున్నాయో దర్శకుడు కబడ్డీ ఆట ద్వారా ప్రస్తావించినట్లు ఉన్నారు. ఇక హీరోయిన్ తమన్నా సైతం కబడ్డీ కోచ్ గా ఈ మూవీలో కనిపించడం విశేషం. అటు గ్లామర్, ఇటు కోచ్ గా సీరియస్ ఆటిట్యూడ్ తో తమన్నా రోల్ ఆసక్తి రేపుతోంది. 


ఇక మెయిన్ విలన్ రావు రమేష్ ని కూడా ట్రైలర్ లో పరిచయం చేశారు. పల్లెటూరి విలన్ గెటప్ లో రావు రమేష్ స్లాంగ్, మేనరిజం అదిరాయి. రెండు నిమిషాల ట్రైలర్ దాదాపు యాక్షన్ సన్నివేశాలతో సాగింది. యాక్షన్ ప్లస్ స్పోర్ట్స్ కలగలిపిన ఎమోషనల్ డ్రామాగా సీటీమార్ ఉండే అవకాశం కలదు. మొత్తంగా ట్రైలర్ తో మూవీపై అంచనాలు పెంచేశాడు దర్శకుడు సంపత్ నంది. దర్శకుడు, హీరో మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తుండగా, ఇద్దరికీ సీటీమార్ బ్రేక్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 


శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో శ్రీనివాస చిత్తూరి సీటీమార్ చిత్రాన్ని తెరకెక్కించారు. సెప్టెంబర్ 10న గ్రాండ్ గా విడుదల కానుంది. మణిశర్మ ఈ మూవీకి సంగీతం సమకూర్చారు. 
 

click me!