కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, అగ్ర దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'సర్కార్' సినిమా దీపావళి కానుకగా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, అగ్ర దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'సర్కార్' సినిమా దీపావళి కానుకగా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది.
ఈ సినిమాపై అటు తమిళంలో ఇటు తెలుగులో కూడా హైప్ క్రియేట్ అయింది. విజయ్-మురుగదాస్ కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన 'తుపాకీ','కత్తి' వంటి సినిమా ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయంపై ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
undefined
దుబాయిలో ఉంటూ యూఏఈ సెన్సార్ బోర్డు మెంబర్ గా చెప్పుకునే ఉమైర్ సంధు తెలుగు, తమిళ చిత్రాలకు ఫస్ట్ రివ్యూ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమాకి కూడా ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చారు. తాజాగా 'సర్కార్' సినిమాకి కూడా రివ్యూ ఇస్తూ ఆయన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు.
విజయ్ మాస్ హీరో ఇమేజ్ కి తగ్గట్లుగా అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయని, సోషల్ మెసేజ్, సంగీతం, మురుగదాస్ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాని నిలబెట్టాయని.. ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని వెల్లడించారు. ఇది వన్ మ్యాన్ షో అని.. సినిమాలో యాక్షన్ సీన్స్, స్టోరీ, పంచ్ డైలాగులు విజయ్ లో మాస్ ఎఫెక్ట్ ని ఎలివేట్ చేశాయని అన్నారు.
దీపావళికి ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం ఖాయమని అంటున్నారు. అంతేకాదు సినిమాకి 4/5 రేటింగ్ కూడా ఇచ్చేశారు. మరి ఆయన చెప్పినట్లుగానే ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి!
ఇవి కూడా చదవండి..
విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?
ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!
మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్ రాజీనామా
'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!
48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!
గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్
విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!
సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?
సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!
యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!