మెగాఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. చరణ్ ఫస్ట్ లుక్, టీజర్ డేట్స్!

Published : Nov 05, 2018, 04:42 PM IST
మెగాఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. చరణ్ ఫస్ట్ లుక్, టీజర్ డేట్స్!

సారాంశం

సుకుమార్ రూపొందించిన 'రంగస్థలం' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. దీంతో అతడి తదుపరి సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం చరణ్.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. 

సుకుమార్ రూపొందించిన 'రంగస్థలం' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. దీంతో అతడి తదుపరి సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి మరింత పెరిగిపోయింది.

ప్రస్తుతం చరణ్.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి ఇంతకాలమవుతున్నా.. ఇప్పటివరకు సినిమా టైటిల్ గానీ దాని వివరాలు గానీ వెల్లడించలేదు. 

దీపావళి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నవంబర్ 6న మధ్యాహ్నం ఒంటి గంటకి చరణ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను, టీజర్ ని నవంబర్ 9న ఉదయం 10 గంటల 25 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. 

 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌