మోసపోయిన రమ్యకృష్ణ, నయనతార.. కోట్లలో నష్టం!

By Satish ReddyFirst Published Jul 31, 2020, 10:46 AM IST
Highlights

ఓ రియల్ ఎస్టేట్‌ కంపెనీ చేతిలో అందాల భామలు రమ్యకృష్ణ, నయనతార మోసపోయారట. అంతేకాదు సదరు సంస్థ చేతిలో లెజెండరీ క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్‌ సతీమణి కూడా మోసపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

వ్యాపార వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండకపోతే నష్టాలు తప్పవు. ముఖ్యంగా రియల్‌ స్టేట్ వ్యవహారాల్లో ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా కోట్లు కోల్పోవాల్సి వస్తుంది. టాప్‌ హీరోయిన్లు నయనతార, రమ్యకృష్ణలకు ఇలాంటి అనుభవమే ఎదురైందన్న విషయం కోలీవుడ్‌ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ రియల్ ఎస్టేట్‌ కంపెనీ చేతిలో ఈ ఇద్దరు అందాల భామలు మోసపోయారట. అంతేకాదు సదరు సంస్థ చేతిలో లెజెండరీ క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్‌ సతీమణి కూడా మోసపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు నిర్మించేందుకు భారీ ఎత్తున స్థలాలు సేకరించింది. ఆ స్థలాన్ని కోట్లు రూపాయలకు సెలబ్రిటీలకు విక్రయించారు. అయితే ఆ కంపెనీ సేకరించిన ఆ భూమి వ్యవసాయ భూమి అని, అక్కడ రియల్‌ ఎస్టేట్‌ కన్స్‌స్ట్రక్షన్స్‌కు అనుమతులు లభించవని తరువాత బయటపడిందట. కేవలం ఎకరం లక్ష రూపాయల చొప్పున వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కోట్ల రూపాయలకు ఆ భూమిని అమ్మింది.

ఇటీవల కంపెనీ భాగస్వాముల మధ్య వివాదాలు రావటంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు సదరు కంపెనీకి లీగల్‌ నోటీసులు కూడా పంపినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కంపెనీ చేతిలో నయనతార, రమ్యకృష్ణ సహా మరికొంత మంది మోసపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నా.. ఇంతవరకు ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. ఈ వ్యవహారంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

click me!