'అరవింద సమేత'పై సీమ ఆగ్రహం!

Published : Oct 15, 2018, 02:07 PM IST
'అరవింద సమేత'పై సీమ ఆగ్రహం!

సారాంశం

ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే సినిమా వంద కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఈ నేపధ్యంలో సినిమా కథ తనదంటూ రచయిత వేంపల్లి గంగాధర్ దర్శకుడు త్రివిక్రమ్ పై కామెంట్స్ చేశాడు. 

ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే సినిమా వంద కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఈ నేపధ్యంలో సినిమా కథ తనదంటూ రచయిత వేంపల్లి గంగాధర్ దర్శకుడు త్రివిక్రమ్ పై కామెంట్స్ చేశాడు.

ఈ వివాదం ఇంకా ఓ కొలిక్కి రాకముందే రాయలసీమకి చెందిన కొన్ని విద్యార్ధి సంఘాలు 'అరవింద సమేత'పై విరుచుకుపడుతున్నాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ రాయలసీమ ప్రాంతంపై కక్ష కట్టిందని ఆ ప్రాంత విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాయలసీమలో కనుమరుగైన ఫ్యాక్షనిజాన్ని దర్శకుడు త్రివిక్రమ్ 'అరవింద సమేత' సినిమాతో మళ్లీ రెచ్చగొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, కొన్ని డైలాగులు తమ మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని వెంటనే వాటిని తొలగించి, దర్శకుడు త్రివిక్రమ్ రాయలసీమ వాసులకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి విద్యార్ధి సంఘాలు. 

ఫ్యాక్షన్ సన్నివేశాలు యూత్ పై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్ధులు. అభ్యంతరకర సన్నివేశాలు,  డైలాగులు తొలగించకపోతే రాయలసీమలో సినిమా ప్రదర్శనలను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. 

 సంబంధిత వార్తలు..

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' సెన్సేషనల్ రికార్డ్!

అరవింద సమేత: మూడు రోజుల కలెక్షన్స్!

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

PREV
click me!

Recommended Stories

డ్రింక్ తాగు, పార్టీ చేసుకో.. ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకు.! క్రేజీ హీరోయిన్‌కి తల్లి బోల్డ్ సలహా
2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా