‘‘తిత్లీ’’ తుఫాను బాధితులకు అన్నదమ్ముల సాయం

Published : Oct 15, 2018, 01:00 PM IST
‘‘తిత్లీ’’ తుఫాను బాధితులకు అన్నదమ్ముల సాయం

సారాంశం

గతంలో కేరళను వరదలు, వర్షాలు ముంచేసినప్పుడు కూడా తారక్‌, కల్యాణ్ రామ్‌ వారికి సాయం చేసి అండగా నిలిచారు. 

 ‘తిత్లీ’ తుపానుతో అల్లకల్లోకమైపోయిన ఉత్తరాంధ్రకు అగ్ర కథానాయకులు , నందమూరి సోదరులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు ఆర్థిక సాయం అందించారు.  ఎన్టీఆర్.. రూ.15లక్షలు, కల్యాణ్‌ రామ్‌ రూ.5 లక్షలు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. ఈ విషయాన్ని చిత్రసీమ వర్గాలు ట్విటర్‌ ద్వారా వెల్లడించాయి. గతంలో కేరళను వరదలు, వర్షాలు ముంచేసినప్పుడు కూడా తారక్‌, కల్యాణ్ రామ్‌ వారికి సాయం చేసి అండగా నిలిచారు. అప్పట్లో తారక్‌ రూ.25 లక్షలు ఇవ్వగా కల్యాణ్‌రామ్‌ రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు.

‘తిత్లీ’ బాధితులకు యువకథానాయకుడు విజయ్‌ దేవరకొండ, ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా సాయం చేశారు. విజయ్‌ రూ.5లక్షలు విరాళంగా ఇచ్చారు. అనిల్‌ లక్ష రూపాయలు సీఎం నిధికి అందించారు. కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ‘తిత్లీ’ తుపాను బీభత్సం సృష్టించింది. ఈ రెండు జిల్లాల్లోని దాదాపు పన్నెండు మండలాల్లో ‘తిత్లీ’ తీవ్ర నష్టం కలిగించిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Trigun: సొంత టీంకే వెన్నుపోటు, త్రిగుణ్ దెబ్బకు మారిపోయిన ఆట..కెప్టెన్ గా అవతరించిన రామ్ ప్రసాద్
Ramayana:హైదరాబాద్ లో రామాయణ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్..రణబీర్, యశ్ తోపాటు టీమ్ మొత్తం రెడీ