టీవీ నటి సెక్స్ వీడియో లీక్.. రేప్ చేశారని కంప్లైంట్!

By Udaya DFirst Published Apr 12, 2019, 11:16 AM IST
Highlights

మలయాళం టీవీ ఇండస్ట్రీలో నటిగా, మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న 61 ఏళ్ల నటి తనపై 37 ఏళ్ల వ్యక్తి రేప్ చేశాడని పోలీసులకు కంప్లైంట్ చేసింది. 

మలయాళం టీవీ ఇండస్ట్రీలో నటిగా, మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న 61 ఏళ్ల నటి తనపై 37 ఏళ్ల వ్యక్తి రేప్ చేశాడని పోలీసులకు కంప్లైంట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఎర్నాకులం ప్రాంతానికి చెందిన సియా అనే వ్యక్తి ఫోన్ ద్వారా తనతో స్నేహం చేశాడని, స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇస్తానని చెప్పి పలు సందర్భాల్లో తనను సెక్సువల్ గా 
వాడుకున్నాడని సదరు నటి ఫిర్యాదులో పేర్కొంది.

సియా తనను తోట్టపల్లిలోని హోటల్ రూమ్ లో, ఆ తరువాత కాయంకులంలోని తన ఇంటికి వచ్చి కూడా లైంగికంగా వాడుకున్నాడని ఆరోపించారు. అంతేకాకుండా ఫోన్లో సెక్స్ వీడియోలను చిత్రీకరించి తన భర్తకు, కుటుంబసభ్యులను, చుట్టుపక్కల వారికి పంపించాడని కంప్లైంట్ లో పేర్కొన్నారు.

కొన్ని రోజుల క్రితం ఈ నటికి సంబంధించిన సెక్స్ వీడియో వాట్సాప్ లో వైరల్ అవ్వడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు మాత్రం ఈ నటినే తప్పుబడుతున్నారు.

వీడియో చూస్తుంటే రేప్ చేసినట్లుగా లేదని.. ఇద్దరూ ఇష్టపూర్వకంగానే ఉన్నట్లు చెబుతున్నారు. వీడియో లీక్ అయిందని ఆమె ఇప్పుడు పోలీసులను ఆశ్రయించిందని.. ఇందులో అబ్బాయి తప్పు ఎంత ఉందో.. ఆమె తప్పు కూడా ఉందని వాదిస్తున్నారు. 

click me!