RGV: ప్రేమ, సెక్స్ సంబంధం గురించి వర్మ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. రెచ్చిపోతున్న నెటిజన్లు

By Aithagoni RajuFirst Published Dec 8, 2021, 1:54 PM IST
Highlights

రామ్‌గోపాల్‌ వర్మ మరో బోల్డ్ స్టేట్ మెంట్‌ ఇచ్చారు. గతంలో తాను మార్నింగ్‌ నిద్ర లేవగానే పోర్న్ సినిమాలు చూస్తానని చెప్పి షాకిచ్చారు. ఇప్పుడు ప్రేమ, సెక్స్ గురించి మరో షాకింగ్‌ కామెంట్‌ చేశారు.

రామ్‌గోపాల్‌ వర్మ(Ram Gopal Varma).. తెలుగు సినిమాల్లో ఒక ట్రెండ్‌ సెట్టర్‌. `శివ` సినిమాతో ఆయన తెలుగు సినిమా కథల్లోని స్టయిల్‌ని మార్చేశారు. `క్షణక్షణం`, `గాయం`, `సర్కార్‌` ఇలా విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించారు. మాఫియా చిత్రాల సినిమా పోకడలనే మార్చేశారు RGV. ఒకప్పుడు స్టార్‌ హీరోల స్థాయి ఇమేజ్‌ని సొంతం చేసుకున్న డైరెక్టర్‌ వర్మ. కానీ ఇప్పుడు అసలు వర్మకి సినిమాలు తీయడం వచ్చా? అనేంతగా పడిపోయారు. నాసిరకమైన సినిమాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. దీంతో అనేక విమర్శల పాలవుతున్నారు. 

అయితే వివాదాస్పద, రియలిస్టిక్‌ అంశాలతో తాను చెప్పాలనుకున్న విషయాలను బోల్డ్ గానే చెబుతూ తన ప్రత్యేకతని చాటుకుంటున్నారు. వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. సినిమాల్లోనే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ బోల్డ్ నెస్‌కి, వివాదాలకు ఆయన ప్రతిరూపంగా నిలుస్తున్నారు. వివాదాస్పద కామెంట్లు, సెటైర్లతో, సంచలనాత్మక కామెంట్లతో నిత్యం వార్తల్లొ నిలుస్తున్నారు. దీంతో వివాదాస్పద, సంచలన దర్శకుడిగా మారిపోయాడు వర్మ. 

వర్మ గతంలో తాను ఉదయాన్నే లేచి పోర్న్ సినిమాలు చూస్తానని చెప్పి షాకిచ్చాడు. ఆ వీడియోలు చూస్తేనే తాను మైండ్‌ ఒత్తిడి నుంచి బయటపడుతుందని, ఫ్రెష్‌గా వర్క్ చేసుకోగలుగుతానని తెలిపాడు. కొన్ని బూతు సినిమాలు కూడా తీశాడు వర్మ. అయితే తాజాగా ప్రేమ, సెక్స్ కి సంబంధించి కొత్త నిర్వచనం ఇచ్చాడు. బోల్డ్ కామెంట్‌ చేశారు. ప్రేమని, సెక్స్ ని కెమిస్ట్రీ, ఫిజిక్స్ తో ముడిపోట్టారు. `ప్రేమ అనేది కెమిస్ట్రీకి సంబంధించినదని, కానీ సెక్స్  ఫిజిక్స్ కి సంబంధించినది` అని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేసి మరో సంచలనానికి తెరలేపాడు. 

Love is about chemistry , but sex is physics

— Ram Gopal Varma (@RGVzoomin)

వర్మ ఈ పోస్ట్ ఎందుకు పెట్టాడనేది ఇప్పుడు సోషల్‌ మీడియా హాట్‌ హాట్‌ గా చర్చ నడుస్తుంది. ఆయన దేన్నిఉద్దేశించి పెట్టాడనేది సస్పెన్స్ గా మారింది. అదే సమయంలో నెటిజన్లు మరింతగా రెచ్చిపోతున్నారు. వర్మ అంటే ఆయన్ని మించిన వాళ్లం మేం అంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. `అందులో లస్ట్ మ్యాథ్స్ కి సంబంధించినది కొలతలు పెడుతున్నారు. `మ్యారేజ్‌ కామర్స్ కి సంబంధించినది` అని, విడాకులు అనేది అన్నింటికి సంబంధించిన ఆర్ట్స్ అని, ప్రెగ్నెన్సీ బయోలజీ అని అంటూ కామెంట్లు, ట్రోల్స్ రూపంలో తెలియజేస్తూ వర్మకి చుక్కలు చూపిస్తున్నారు. 

రామ్‌గోపాల్‌ వర్మ.. ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన `డేంజరస్‌`, `12 o clock` అనే హర్రర్‌ సినిమా, `లడ్కీ` మూవీ, `కొండా` అనే సినిమాలను రూపొందిస్తున్నారు. `కొండా` మూవీ కొండా సురేఖ, కొండా మురళీ జీవితాల ఆధారంగా రూపొందిస్తున్నారు.

also read: అల్లు అర్జున్ వలె చిరు, పవన్ చేయగలరా... మెగా ఫ్యామిలీలో వర్మ చిచ్చు

click me!