అప్పుడు దేవుడి నగలు ఎలా కొల్లగొట్టచ్చో అని వచ్చా: రామ్ గోపాల్ వర్మ!

By Udayavani DhuliFirst Published Oct 19, 2018, 7:05 PM IST
Highlights

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రతో ఆయన రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి ఆ దేవుడి ఆశీస్సులతో పాటు ఎన్టీఆర్ ఆశీస్సులు కూడా ఉండాలని శ్రీవారిని దర్శించుకున్నట్లు వర్మ చెప్పారు.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రతో ఆయన రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి ఆ దేవుడి ఆశీస్సులతో పాటు ఎన్టీఆర్ ఆశీస్సులు కూడా ఉండాలని శ్రీవారిని దర్శించుకున్నట్లు వర్మ చెప్పారు.

నాస్తికుడైన వర్మ శ్రీవారి దర్శనం కోసం తిరుమలకి వెళ్లడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విశేషాల చెప్పడం కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ''ఇన్నేళ్ల తరువాత తిరుమలకి వచ్చి దేవుడిని దర్శించుకున్నాను.

20 ఏళ్ల ముందు దేవుడి నగలు ఎలా కొల్లగొట్టొచ్చో అని వచ్చాను. అప్పుడు దేవుడి ఆగ్రహించి గోవిందా గోవిందా సినిమా ఫ్లాప్ చేశారు. ఆ సినిమా ఫ్లాప్ తో నేను ముంబై పారిపోయాను'' అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

ఇది ఇలా ఉండగా.. వైసీపీ కి రాకేశ్ రెడ్డికి మాత్రమే సంబంధం ఉందని, సినిమాకు రాకేశ్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వర్మ స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి.. 

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన


ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!

click me!