రకుల్ క్లీవేజ్ డోస్ ఎక్కువైందే!

By Udaya DFirst Published Apr 12, 2019, 10:16 AM IST
Highlights

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు అవకాశాలు బాగా తగ్గాయి. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు అవకాశాలు బాగా తగ్గాయి. దీంతో ఆమె తమిళ, హిందీ భాషల్లో ఛాన్స్ ల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆమెకి బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది.

వీరిద్దరూ కలిసి నటించిన 'దే దే ప్యార్ దే' సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో రకుల్ గ్లామర్ డోస్ కాస్త ఎక్కువైందనే కామెంట్స్ వినిపించాయి. తాజాగా ఈ సినిమాలో ఓ వీడియో సాంగ్ ని విడుదల చేశారు.

ఈ పాటలో రకుల్ మరింత గ్లామర్ గా కనిపించింది. చీర కట్టుకొని ఓ రేంజ్ లో అందాల ఆరబోత చేసింది. చేతిలో మందు బాటిల్ పట్టుకొని తాగుతూ పంజాబీ స్టైల్ లో పాట పాడుతూ రచ్చ చేసింది. ఈ పాటను రకుల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా విడుదల చేసింది రకుల్.

''వడ్డి షరాబన్ సాంగ్ రిలీజ్ అయింది. నేను నా ఉత్సాహాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా.. ఈ పాట చిత్రీకరణ ఓ అధ్బుతమైన అనుభవం. అసలు మందే ముట్టుకోని నా నుండి తాగుబోతుని బయటకి తీసినందుకు బాస్కో మార్టిన్ డాన్స్ మాస్టర్ కి థాంక్స్'' అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది. 

 

click me!