'మీటూ'పై రజినీకాంత్ కామెంట్!

By Udayavani DhuliFirst Published Oct 20, 2018, 2:31 PM IST
Highlights

బాలీవుడ్ తో పాటు దక్షినాదిలో కూడా మీటూ ఉద్యమం చెలరేగుతోంది. పలువురు మహిళలు కొందరు తారలపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై కొందరు సెలబ్రిటీలు బాధితులకి మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం కావాలనే ప్రముఖులపై ఆరోపణలు చేస్తున్నారని వాదిస్తున్నారు. 

కమల్ హాసన్ లాంటి నటులు వేధింపులకు గురైన మహిళలు వారే డైరెక్ట్ గా ముందుకు వచ్చి మాట్లాడాలని పేర్కొన్నారు. సమంత, రకుల్ వంటి హీరోయిన్లు మహిళలు ధైర్యంగా తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టడం మంచి పరిణామమని కొనియాడారు. 

తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ మీటూ ఉద్యమంపై కామెంట్స్ చేశారు. 'మీటూ ఉద్యమం మహిళకు మంచిదే కానీ.. దీన్ని దుర్వినియోగం చేయొద్దని' రజినీకాంత్ అన్నారు. ప్రస్తుతం ఆయన కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 'పేటా' అనే సినిమాలో నటిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమాకు  సంబంధించిన పోస్టర్లు, మోషన్ పోస్టర్ విడుదలై సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. 

ఇవి కూడా చదవండి.. 

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!

click me!