సూపర్ స్టార్ ఇచ్చిన షాక్ మాములుగా లేదు!

Published : Oct 20, 2018, 02:17 PM IST
సూపర్ స్టార్ ఇచ్చిన షాక్ మాములుగా లేదు!

సారాంశం

సాధారణంగా ఎంత చిన్న సినిమా అయినప్పటికీ షూటింగ్ కి మినిమమ్ ఐదారు నెలల సమయం పడుతుంది. ఇక స్టార్ హీరోల సినిమాలకైతే ఒక ఏడాది అనేది గ్యారెంటీగా మారింది.

సాధారణంగా ఎంత చిన్న సినిమా అయినప్పటికీ షూటింగ్ కి మినిమమ్ ఐదారు నెలల సమయం పడుతుంది. ఇక స్టార్ హీరోల సినిమాలకైతే ఒక ఏడాది అనేది గ్యారెంటీగా మారింది. దర్శకుడి ప్లానింగ్ ను బట్టి కూడా షూటింగ్ ఆధారపడి ఉంటుంది. ఇక రీసెంట్ గా రజినీకాంత్ తో యువ దర్శకుడు వర్క్ చేసిన విధానం అందరిని ఆకర్షించింది. 

మెయిన్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ షాకిచ్చారనే చెప్పాలి. రజినీ సినిమాలంటే ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఆయన సినిమాలో స్టార్ నటీనటులు ఉంటారు కాబట్టి వారి డేట్స్ ను బట్టి కూడా షెడ్యూల్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే యంగ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు రజినీతో పేట సినిమా షూటింగ్ ను నాలుగునేళ్లలోపే పూర్తి చేశాడు. అసలైతే ముందుగా అనుకున్న దాని ప్రకారం ఐదు నెలల సమయం చిత్రీకరణకు కేటాయించారు. 

కానీ ఇప్పుడు నాలుగు నెలలకి మరో 15 రోజులు మిగిలి ఉండగానే పూర్తయ్యింది. ముఖ్యంగా రజినీకాంత్ సపోర్ట్ చేయడం వల్లే సినిమా ఫాస్ట్ గా ఫినిష్ చేసినట్లు సమాచారం. నవాజుద్దీన్ సిద్దిఖి - విజయ్ సేతుపతి - సిమ్రాన్ - త్రిష లాంటి నటి నటులు ఉన్నప్పటికీ వారి డేట్స్ ను కరెక్ట్ గా సెట్ చేసుకొని పేట సినిమాను జెట్ స్పీడ్ లో పూర్తి చేశారు. 

సాధారణంగా చిన్న సినిమాలకు ఆరు నెలల సమయం పడుతుంది. ఇక పెద్ద సినిమాలకైతే రెండేళ్ల సమయం. కానీ సూపర్ స్టార్ సినిమా ఇంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి రావడం ఆశ్చర్యంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?