ఆ సినిమాలపై ఐపీఎల్‌ ఎఫెక్ట్‌.. రిలీజ్ వాయిదా!

By Satish ReddyFirst Published Sep 17, 2020, 7:20 AM IST
Highlights

గతంలో ఐపీఎల్ దృష్టిలో పెట్టుకొని సినిమాల రిలీజ్‌లు ప్లాన్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. థియేటర్లలో సినిమా రిలీజ్ చేసే పరిస్థితి లేకపోవటంతో సినిమాలను ఓటీటీలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి ఐపీఎల్ సీజన్‌ ఉండదన్న ఉద్దేశంతో కొన్ని సినిమాలను సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

ఇండియాన్‌ ఆడియన్స్‌కు సినిమా, క్రికెట్‌ రెండూ రెండు ప్రాణాలు అందుకే మన దేశంలో సినిమా హీరోలను, క్రికెట్‌ స్టార్స్‌ను దేవుళ్లుగా కొలుస్తుంటారు. అయితే ఈ రెండింటి మధ్య పోటి ప్రేక్షకుల ఓటు ఎటూ. అవును వరల్డ్ కప్‌, ఐపీఎల్‌ లాంటి సీజన్ల సమయంలో ఇది ప్రశ్న ఎదురువుతుంది. భారీ క్రికెట్‌ సీజన్‌ నడుస్తున్న సమయంలో సినిమాలో రిలీజ్ చేయటం అంటే రిస్క్‌ అని భావిస్తారు మన ఫిలిం మేకర్స్.

గతంలో ఐపీఎల్ దృష్టిలో పెట్టుకొని సినిమాల రిలీజ్‌లు ప్లాన్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. థియేటర్లలో సినిమా రిలీజ్ చేసే పరిస్థితి లేకపోవటంతో సినిమాలను ఓటీటీలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి ఐపీఎల్ సీజన్‌ ఉండదన్న ఉద్దేశంతో కొన్ని సినిమాలను సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ సడన్‌ ఐపీఎల్‌ సీజన్‌ షెడ్యూల్‌ రావటంతో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారు.

క్రికెట్‌తో పోటి పడటం కన్నా రిలీజ్‌లు రీ షెడ్యూల్‌ చేసుకోవటమే బెటర్ అని భావిస్తున్నారట. అందుకే బాలీవుడ్‌లో ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేసుకున్న మూడు సినిమాలు తమ రిలీజ్‌లను రీ షెడ్యూల్‌ చేసుకున్నాయి. అక్షయ్‌ కుమార్ హీరోగా తెరకెక్కిన `లక్ష్మీ బాంబ్‌`, అజయ్ దేవగన్‌ `భుజ్‌`, అభిషేక్‌ బచ్చన్‌ `బిగ్‌ బుల్‌` సినిమాలను నవంబర్‌ డిసెంబర్‌లలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అలా అయితే సబ్‌స్క్రైబర్‌లు, వ్యూయర్‌ షిప్‌ పెరుగుతుందని వారి అంచనా.

click me!