ప్రముఖ సింగర్‌ బిప్రాక్‌ ఇంట్లో తీవ్ర విషాదం.. అప్పుడే పుట్టి అంతలోనే..

Published : Jun 17, 2022, 03:29 PM IST
ప్రముఖ సింగర్‌ బిప్రాక్‌ ఇంట్లో తీవ్ర విషాదం.. అప్పుడే పుట్టి అంతలోనే..

సారాంశం

`సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో `సూర్యుడివో.. చంద్రుడివో` పాట పాడిన సింగర్‌ బిప్రాక్‌ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

ప్రముఖ ఇండియన్‌ సింగర్‌ బిప్రాక్‌(Singer Bpraak) ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పుట్టిన బిడ్డ పొత్తిళ్లలోనే కన్నుమూసింది. పది నెలల క్రితం బిప్రాక్‌ భార్య మీరా ప్రెగ్నెంట్‌ అయినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గురువారం మీరా పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. దీంతో ఎంతో మురిసిపోయిందీ బిప్రాక్‌ జంట. వారి ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. అంతలోనే ఆ ఆనందం ఆవిరైంది. తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పుట్టిన బిడ్డ కొద్దిసేపట్లోనే కన్నుమూసింది. పొత్తిళ్లలోనే ఆ చిన్నారి కన్నుమూయడంతో బిప్రాక్‌ జంట గుండె బద్దలయ్యింది. 

ఈ విషయాన్ని సింగర్‌ బిప్రాక్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనో పోస్ట్ పెట్టి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు మాకు పండంటి బిడ్డ పుట్టింది. కానీ అంతలోనే ఆ బిడ్డ మమ్మల్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోయింది. పుట్టిన సమయంలోనే బిడ్డ చనిపోయింది. ఇది ఓ పేరెంట్స్ గా మేం భరించలేకపోతున్నాం. మా చిన్నారిని కాపాడేందుకు చివరి వరకు ప్రయత్నించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ చేసిన వారికి, అభిమానులకు ధన్యవాదాలు. ఈ సమయంలోనే మా ప్రైవసీని మాకు అందించమని అందరిని వేడుకుంటున్నా` అని తన బాధని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 

బిప్రాక్‌ పోస్ట్‌పై పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు ధైర్యానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సింగర్‌ బిప్రాక్ మంచి సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈవెంట్లతోనూ ఆయన అలరిస్తుంటారు. ఆయన పాటలకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తెలుగులో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో `సూర్యుడివో చంద్రుడివో` అనే పాట పాడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. బీప్రాక్‌, మీరా బచెన్‌ 2019లో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. వీరి మ్యారేజ్‌కి ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్లు, సినీ సెలబ్రిటీలు భారీగా హాజరయ్యారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు