
లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) సినిమాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. అయితే ఆయన తోటి హీరోలైన రజనీ మార్కెట్ ని మాత్రం రీచ్ కాలేకపోయారు. అందుకు కారణం వరసపెట్టి చేస్తున్న ప్రయోగాలు కావచ్చు. అది మార్కెట్ పై నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తోంది. అయితే దాన్ని విక్రమ్ చిత్రం మార్చేసింది. ఈ సినిమాకు (Lokesh Kanagaraj) లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు అటు తమిళ, హిందీ భాషల్లో కూడా మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలై అక్కడ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ చిత్రం రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరింది. రజనీకాంత్ 2.0 తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన 2వ తమిళ సినిమా విక్రమ్. ఈ సినిమా ఇప్పటి వరకు 417.10 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది. వీటిలోరూ. 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు ఓవర్సీస్ నుండి వచ్చాయి. ఆ క్రమంలో కమల్ నెక్ట్స్ ప్రాజెక్టుకు ట్రేడ్ లో ఓ రేంజిలో బజ్ క్రియేట్ అయ్యింది. దాంతో బిజినెస్ హాట్ కేకులా జరుగుతోందని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి. ఆ సినిమా మరేదో కాదు థగ్ లైఫ్.
దిగ్గజ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) 35 ఏళ్ల తరవాత మళ్లీ చేతులు కలిపారు. వీరిద్దరూ కలిసి భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. ఇది కమల్ హాసన్ 234వ సినిమా. 2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మాగ్జిమం హైప్ ఉన్న థగ్ లైఫ్ సినిమాకు తాజాగా ఇంటర్నేషనల్ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కుల డీల్ కుదిరింది.
థగ్ లైఫ్ సినిమా ఇంటర్నేషనల్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఏపీ ఇంటర్నేషనల్, హోం స్క్రీన్ ఎంటర్‌టైన్‍మెంట్ సంయుక్తంగా సొంతం చేసుకున్నాయి. రూ.63కోట్లను ఈ ఓవర్సీస్ హక్కుల ద్వారా థగ్ లైఫ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమా ఓవర్సీస్ రైట్స్ గతేడాది రూ.60కోట్లకు అమ్ముడయ్యాయి. అయితే, ఇప్పుడు థగ్ లైఫ్ మూవీ ఓవర్సీస్ డీల్ రూ.63 కోట్లకు జరిగి దాన్ని దాటింది.
ఓ అవార్డు వేడుకలో పాల్గొన్న మణిరత్నం ఈ సినిమా గురించి మాట్లాడారు. ‘‘కమల్ హాసన్‌తో మరో సినిమా తీసేందుకు 37ఏళ్లు పట్టింది. ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ నటుల్లో ఆయన ఒకరు. చిన్న కథలను ఆయనతో తీయకూడదు. తన స్థాయికి తగిన కథ ఉన్నప్పుడు మాత్రమే ఆయన్ని సంప్రదించాలి. ఇప్పుడు మేము ‘థగ్‌లైఫ్’తో మరోసారి చరిత్ర సృష్టించనున్నాం. ’ అని తెలిపారు.