ఛలో సినిమా సూపర్ హిట్, కానీ మాకు డబ్బులు రాలేదు..నాగ శౌర్య తల్లి కామెంట్స్

Published : May 14, 2024, 05:24 PM IST
ఛలో సినిమా సూపర్ హిట్, కానీ మాకు డబ్బులు రాలేదు..నాగ శౌర్య తల్లి కామెంట్స్

సారాంశం

టాలీవుడ్ లో రాణిస్తున్న యువ హీరోల్లో నాగ శౌర్య ఒకరు. నాగ శౌర్య బాగా కష్టపడుతున్నప్పటికీ ఆశించిన సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ఛలో లాంటి హిట్ నాగ శౌర్య కి మళ్ళీ రిపీట్ కాలేదు.

టాలీవుడ్ లో రాణిస్తున్న యువ హీరోల్లో నాగ శౌర్య ఒకరు. నాగ శౌర్య బాగా కష్టపడుతున్నప్పటికీ ఆశించిన సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ఛలో లాంటి హిట్ నాగ శౌర్య కి మళ్ళీ రిపీట్ కాలేదు. ఇటీవల నాగ శౌర్య నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. 

అయితే నాగ శౌర్యకి తన తల్లి ఉషా మూల్పూరి అతడికి బ్యాక్ బోన్ లా నిలిచారు. నాగ శౌర్య నటించిన కొన్ని చిత్రాలని ఆమె నిర్మించారు. తాజాగా ఇంటర్వ్యూలో ఉషా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. నాగ శౌర్య చిన్నప్పటి నుంచి మేము చెప్పిన దానికి భిన్నంగా చేసేవాడు. ఒక వయసు వచ్చాక నీకు నచ్చింది చేయి అని చెప్పాల్సి వచ్చింది. 

హీరోగా నాగ శౌర్య ఈ గుర్తింపు తెచ్చుకున్నాడు అంటే అది అతడి కష్టమే. మా ప్రమేయం ఏమిలేదు. మేము ఏ రోజున కూడా నాగ శౌర్య చిత్రాలని నిర్మించాలని అనుకోలేదు. ఛలో చిత్రం నాగ శౌర్య చేయాలనుకున్నప్పుడు నిర్మాతల కోసం వెతుకుతున్నాడు. రెమ్యునరేషన్ కూడా అక్కర్లేదు ఫ్రీ చేస్తాను అని చెప్పినా ఏ నిర్మాత ముందుకు రాలేదు. 

నాకు చాలా బాధగా అనిపించింది. ఎవరో నిర్మాత అవసరం లేదు మనమే చేద్దాం అని అప్పుడు డిసైడ్ అయ్యాం. ఆ విధంగా ఛలో చిత్రాన్ని నిర్మించినట్లు ఉషా తెలిపారు. ఛలో మూవీ సూపర్ హిట్ అయింది. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ మాకు డబ్బులు ఇవ్వలేదు. 

నర్తనశాల మూవీ ఫ్లాప్ అయితే మాత్రం ఉదయాన్నే వచ్చి బయ్యర్లు ఆఫీస్ ముందు కూర్చున్నారు అని నాగ శౌర్య తల్లి విమర్శలు చేశారు. ఈ ఇండస్ట్రీలో పరిస్థితి ఈ విధంగా ఉంటుంది అని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి