మూడు రోజుల్లో శంకర్‌ సినిమా విడుదల.. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్‌

Published : May 14, 2024, 06:33 PM IST
మూడు రోజుల్లో శంకర్‌ సినిమా విడుదల.. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్‌

సారాంశం

విక్రమ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన `అపరిచితుడు` మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది.ఇప్పుడు మరోసారి మ్యాజిక్‌ చేయడానికి వస్తుంది. రీ రిలీజ్‌ అవుతుంది.  

ఇండియన్‌ సెన్సేషన్‌ డైరెక్టర్‌ శంకర్‌. పాన్‌ ఇండియా సినిమాల జోరు ఇప్పుడు సాగుతుంది. కానీ ఆయన ఎప్పుడో చూశాడు. `ఇండియన్‌`, `శివాజీ`, `రోబో`తోపాటు `అపరిచితుడు` చిత్రాలు చేశాడు. ఆయా సినిమాలు ఇతర భాషల్లోనూ డబ్‌ అయి ఆదరణ పొందాయి. విజయాలు సాధించాయి. ఇప్పుడు `ఇండియన్‌ 2`, `గేమ్‌ ఛేంజర్‌` వంటి పాన్‌ ఇండియా మూవీస్‌తో బిజీగా ఉన్నాడు శంకర్‌. ఈ క్రమంలో ఆయన సినిమా థియేటర్లోకి రాబోతుండటం విశేషం. 

శంకర్‌ బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్స్ లో `అపరిచితుడు` ఒకటి. విక్రమ్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో సదా హీరోయిన్‌గా నటించగా, ప్రకాష్‌ రాజ్‌ పోలీస్‌గా నెగటివ్‌ రోల్‌ చేశారు. సమాజంలో అవినీతి, లంచగొండి తనం, వ్యవస్థలో లోపాలపై ఈ చిత్రాన్ని రూపొందించారు శంకర్‌. 2005లో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. 20కోట్లతో రూపొంది ఏకంగా అరవై కోట్లు వసూలు చేసింది. శంకర్‌ టేకింగ్‌, విక్రమ్‌ నటన, సదా అందాలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. 

చారిగా, రెమోగా, అపరిచితుడిగా మూడు పాత్రల్లో విక్రమ్‌ యాక్టింగ్‌ చూస్తే మతిపోవాల్సిందే. ఓ రకంగా విశ్వరూపం చూపించారని చెప్పాలి. దీంతోపాటు హరీష్‌ జై రాజ్‌ మ్యూజిక్‌ మరో అసెట్‌. పాటలన్నీ సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇరవై ఏళ్ల క్రితం సంచలనాలు సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు మళ్లీ అలరించేందుకు వస్తుంది. థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇటీవల సినిమాల రీ రిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో `అపరిచితుడు` మూవీని మళ్లీ థియేటర్లోకి తీసుకువస్తున్నారు. ఈ నెల 17న ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. తెలుగు, తమిళంలో రీ రిలీజ్‌ చేస్తున్నారు.

మూడో మూడు రోజుల్లో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది. దీంతో అడ్వాన్స్ బుకింగ్‌ని ఓపెన్‌ చేశారు. దీనికి విశేష స్పందన లభిస్తుందని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు కావడంతో ఆడియెన్స్ సినిమాల వైపు చూస్తున్నారు. దీంతో ఈ శుక్రవారం రీ రిలీజ్‌ కాబోతున్న `అపరిచితుడు`కి బుకింగ్స్ లో మంచి రెస్పాన్స్ ఉందని టీమ్‌ తెలియజేయడం విశేషం. మరి ఏ స్థాయిలో ఆదరణ పొందుతుంది? ఆ మ్యాజిక్‌ రిపీట్ అవుతుందా అనేది చూడాలి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Naga Chaitanya కంటే ముందే.. అఖిల్ తండ్రి కాబోతున్నాడా? తాత కావడంపై నాగార్జున అక్కినేని రియాక్షన్ ఏంటి?
Chiranjeevi-Balakrishna కాంబో సెట్టింగ్‌.. బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించేలా బడా నిర్మాత భారీ స్కెచ్‌