ఎట్టకేలకు రిలీజ్‌కి అల్లు శిరీష్‌ మూవీ.. `షరతులు వర్తిస్తాయి` ఓటీటీ టైమ్‌ ఫిక్స్..

Published : May 14, 2024, 07:17 PM IST
ఎట్టకేలకు రిలీజ్‌కి అల్లు శిరీష్‌ మూవీ.. `షరతులు వర్తిస్తాయి` ఓటీటీ టైమ్‌ ఫిక్స్..

సారాంశం

అల్లువారి హీరో అల్లు శిరీష్‌ రెండేళ్ల గ్యాప్‌తో ఇప్పుడు `బడ్డీ` చిత్రంతో వస్తున్నాడు. ఈ మూవీ అప్‌ డేట్‌ ఇచ్చింది యూనిట్‌. అలాగే చైతన్య రావు `షరతులు వర్తిస్తాయి` ఓటీటీ డేట్‌ ఫిక్స్ అయ్యింది.   

అల్లువారి హీరో అల్లు శిరీష్‌.. అన్న అల్లు అర్జున్‌లా సక్సెస్‌ కాలేకపోతున్నాడు. కెరీర్‌ పరంగా స్ట్రగుల్స్ ఫేస్‌ చేస్తూనే ఉన్నాడు. ఆయన చివరగా `ఊర్వశివో రాక్షసివో` చిత్రంతో వచ్చాడు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోవడంలో సక్సెస్‌ కాలేకపోయింది. కమర్షియల్‌గా పెద్దగా ఆడలేదు. దీంతో రెండేళ్ల గ్యాప్‌తో మళ్లీ వస్తున్నాడు అల్లు శిరీష్‌. `బడ్డీ` చిత్రంతో ఆయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ మూవీ ఎప్పుడో రావాల్సింది. అనేక కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అవుతుంది. ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. 

అందులో భాగంగా తాజాగా ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు. `ఆ పిల్ల కనులే` అంటూ సాగేపాటని రేపు విడుదల చేయబోతున్నారు. ఇక ఇందులో శిరీష్‌కి జోడీగా గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న `బడ్డీ` సినిమాకి హిప్ హాప్ తమీజా ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న బడ్డీ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. 

`షరతులు వర్తిస్తాయి` ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్..

`30 వెడ్స్ 21` వెబ్‌ సిరీస్‌తో పాపులర్‌ అయిన చైతన్య రావు హీరోగా మారి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కాన్సెప్ట్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో మెప్పిస్తున్నాడు. ఇటీవల ఆయన `షరతులు వర్తిస్తాయి` సినిమాతో వచ్చాడు. ఇందులో భూమి శెట్టి ఆయనకు జోడీగా నటించింది. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించారు. స్టార్‌ లైట్‌ స్టూడియోస్‌ పతాకంపై ఈ మూవీ రూపొందింది. రెండు నెలల క్రితం విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది. `ఆహా`లో దీన్ని స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. ఈ నెల 18(శనివారం) నుంచి `షరతులు వర్తిస్థాయి` మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్టు టీమ్‌ వెల్లడించింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఓటీటీలో మీకోసం వీకెండ్‌ లో దుమ్మురేపే 5 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Karthika Deepam 2 Today Episode: కాశీని రెచ్చగొట్టిన వైరా- శ్రీధర్ అరెస్ట్- రక్తం కక్కుకున్న సుమిత్ర