పవర్‌ స్టార్‌ అరుదైన ఫోటో వైరల్‌

By Aithagoni RajuFirst Published Sep 13, 2020, 3:19 PM IST
Highlights

పవన్ కల్యాణ్ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరో. చిరంజీవి చిన్న తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనదైన మానరిజంతో, స్టైలిష్ యాక్షన్ తో పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇక విషయానికి వస్తే పవన్ చిన్నన్న నాగబాబు..  పవన్ కు సంబంధించిన ఓ రేర్ ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తెరపై కనిపిస్తే చాలు ఆయన ఫ్యాన్స్ ఊగిపోతారు. ఆయనకు సంబంధించిన ఏ అప్‌డేట్‌ వచ్చినా పెద్ద పండగే. పవన్‌కి సంబంధించిన కొన్ని అరుదైన విషయాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు. 

తాజాగా పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించి ఓ అరుదైన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. టీనేజ్‌లో, సినిమాల్లోకి రాకముందు పవన్‌ ఎలా ఉన్నాడో అనే లుక్‌ ఇప్పుడు హల్‌చల్‌ చేస్తుంది. అప్పుడప్పుడే వస్తోన్న మీసాలు, గెడ్డంతో కూడిన పాస్‌పోర్ట్ సైజ్‌ ఫోటో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

అయితే ఈ ఫోటోని అభిమానులు ట్రెండ్‌ చేస్తుంటే, కొందరు నెటిజన్లు మాత్రం ట్రోల్‌ చేస్తున్నారు. ఆయన్ని భగత్‌ సింగ్‌తో పోల్చుతున్నారు. మరికొందరు `సరిలేరు నీకెవ్వరు`లోని ట్రైన్‌ సీన్లతో పోలుస్తున్నారు. ఈ మీమ్స్ హల్‌చల్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా పవన్‌ లుక్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తుంది. 

ప్రస్తుతం పవన్‌ రెండేళ్ళ గ్యాప్‌ తర్వాత రీఎంట్రీ ఇస్తూ `వకీల్‌సాబ్‌`లో నటిస్తున్నాడు. దీంతోపాటు క్రిష్‌ డైరెక్షన్‌లో ఓ పీరియడ్‌ చిత్రం చేస్తున్నారు. అలాగే హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పవన్‌ పుట్టిన రోజుని పురస్కరించుకుని విడుదలైన ఈ చిత్రాల పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

🤩🤩🤩 pic.twitter.com/OtZAOpuYs2

— Ranadheer 👑 (@ranadheer63900)

🥰 pic.twitter.com/P6ZalxlDDP

— DRS - Daily Recreation Service (@DRSofficialpage)

🥰 pic.twitter.com/P6ZalxlDDP

— DRS - Daily Recreation Service (@DRSofficialpage)
click me!