ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ లో ఎన్టీఆర్ బయోపిక్

By rajesh yFirst Published 2, Jan 2019, 10:46 AM IST
Highlights

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడుగా.. ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవితాన్ని వెండితెరపై వీక్షించాలని అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. 

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడుగా.. ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవితాన్ని వెండితెరపై వీక్షించాలని అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ బయోపిక్ నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజవుతుంటే నెలరోజుల గ్యాప్ లో మహానాయకుడు ఫిబ్రవరి 7న రిలీజవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో  భారీ గా రిలీజ్ అవుతున్న కథానాయకుడు చిత్రం. మొదటి రోజు బెనిఫిట్ షోలకు ఫ్యాన్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హాంగామా ఇక్కడే కాదు యూఎస్ లో ఒక ఊపు ఊపేలా ఉంది. ఇప్పటికే అక్కడి ధియేటర్స్ అన్ని బుకింగ్స్ స్టార్ట్ అవ్వడం 1+1 ఆఫర్స్ తో ప్రీమియర్స్ తోనే 1 మిలయన్ కొట్టేలా ఉంది. అంతే కాదండోయ్ ప్రపంచంలోనే బిగ్గేస్ట్ ఐమాక్స్ స్క్రీన్ లో ప్రదర్శింపబడుతోంది. మన తెలుగు సినిమాల్లో బాహుబలి 2 తప్పిస్తే ఏ ఇండియన్ సినిమా అక్కడ ప్రదర్శింపబడలేదు. రిలీజ్ అయిన తర్వత ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే జనవరి 9 వరకు ఆగాల్సిందే.  

Last Updated 2, Jan 2019, 10:51 AM IST