షాక్..! నయనతార ఇంట్లోనే డ్రగ్స్ అమ్ముతుందట

First Published May 18, 2018, 12:39 PM IST
Highlights

నయనతార ఇంట్లోనే డ్రగ్స్ అమ్ముతుందట

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార స్మగ్లర్‌ అవతారమెత్తారట. ఈ బ్యూటీ నటించిన చిత్రాలకిప్పుడు యమ క్రేజ్‌ ఉన్న విషయం తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులోనూ చేతి నిండా అవకాశాలు ఉన్నాయి. మరిన్ని చిత్రాలు ఈ అమ్మడి కోసం వెయిటింగ్‌లో ఉన్నాయి.  స్టార్‌ హీరోల చిత్రాలకు దీటుగా నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రాలకు మార్కెట్‌ ఉంది. తన తాజా చిత్రంలో డ్రగ్స్‌ స్మగ్లర్‌గా ఈ అగ్ర నటి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్నది తాజా సమాచారం.

ఇటీవల అనిరుద్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంటూ కొలమావు కోకిల చిత్రంలో నయనతార ఇంట్లోనే మాదక ద్రవ్యాలను విక్రయించే యువతిగా నటిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆమె అలా డ్రగ్స్‌ స్మగ్లర్‌గా ఎందుకు మారారన్నది చిత్రంలో ఆసక్తికరమైన అంశంగా ఉంటుందని చెప్పారు. ఏదేమైనా కొలమావు కోకిల చిత్రం డార్క్‌ హ్యూమర్‌ కథా చిత్రంగా అందరికీ వినోదాన్ని పంచుతుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.  ఈ చిత్రం కోసం నటుడు శివకార్తీకేయన్‌ ఒక పాటను రాయడం విశేషం.

click me!