నాకు ఎవరితోనూ ఎఫైర్స్ లేవు: నటుడు భార్య

By Surya PrakashFirst Published May 24, 2020, 12:29 PM IST
Highlights

న‌వాజుద్ధీన్‌పై ఆయ‌న‌ భార్య ఆలియా గ‌త కొద్ది రోజులుగా నిప్పులు చెరుగుతూనే ఉంది. ఇటీవ‌ల ఆయ‌నకి విడాకులు ఇస్తున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన ఆమె సంసార విష‌యాలు కూడా చెప్పుకొచ్చింది. న‌వాజుద్దీన్ కుటుంబ స‌భ్యులు త‌న‌ని మాన‌సికంగా, శారీరికంగా వేధించార‌ని చెప్పుకొచ్చింది. పిల్ల‌ల‌ని న‌వాజుద్దీన్ స‌రిగా ప‌ట్టించుకోడు. 


బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విడాకుల నోటీసు అందుకున్న సంగతి తెలిసిందే. ఆయన భార్య  ఆలియా తనకు విడాకులు మంజూరు చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు తనకు భరణం మంజూరు చేయించాలని కోర్టును కోరారు.  ఇందుకు సంబంధించి ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు. లీగల్ నోటీసులు మే 7వ తేదీనే ఈ- మెయిల్, వాట్సప్ ద్వారా  పంపించినట్లు ఆలియా లాయర్ తెలిపారు. దీనిపై నవాజుద్దీన్ సిద్ధిఖీ స్పందించాల్సి ఉంది.

 ఇదిలా ఉంటే... ఆమెకున్న అఫైర్స్ కారణంగానే విడాకులు కోరిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం పట్ల ఆమె ఘాటుగా స్పందించారు. తనకు ఎవరితోను అఫైర్స్ లేవని... ఇవన్నీ తప్పుడు రూమర్స్ అని చెప్పారు. వాస్తవాలను వెల్లడించేందుకే తాను ట్విట్టర్ ఖాతాను తెరిచానని వెల్లడించారు.

నవాజ్ తమను చాలా కాలంగా పట్టించుకోవడం మానేశాడని అలియా విమర్శించారు. నాన్న ఎక్కడని తమ ఇద్దరు పిల్లలు అడిగినప్పుడు ఆయనకు ఫోన్ చేసేదాన్నని... షూటింగ్ లో ఉన్నానని, వేరే వారితో మాట్లాడే పని ఉందని చెప్పేవాడని తెలిపారు. ఇంటికి వచ్చేవాడు కాదని అన్నారు. నవాబ్ సోదరుడు తనపై గూఢచర్యం చేసేవాడని, మానిటర్ చేసేవాడని ఆమె ఆరోపించింది. 

అలాగే ఒకసారి ఇంటికి మరో నటుడు మనోజ్ బాజ్ పాయ్ తో కలిసి వచ్చారని... అయన ముందు కూడా తనను కించపరిచేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఏరోజు బయటకు తీసుకెళ్లలేదని చెప్పారు. ఒక భార్యకు దక్కాల్సిన గౌరవం తనకు లభించలేదని అన్నారు. కొన్నేళ్లుగా తాను క్షోభను అనుభవిస్తున్నానని... ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయేలా చేశాడని మండిపడ్డారు. 

నవాజుద్దీన్ సిద్ధిఖీ ... ఆలియాను 2009లో వివాహం చేసుకున్నారు. వారికి కూతురు షోరా, కుమారుడు యానీ సిద్ధిఖీ ఉన్నారు. నవాజుద్దీన్ సిద్దిఖీకి ఆలియాతో రెండో పెళ్లి కావడం విశేషం. వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉన్నాయని ఆలియా న్యాయవాది మీడియాకు తెలిపారు. ఐతే వాటిని బయటపెట్టడం ఇష్టం లేదని స్పష్టం చేశారు.
 
ఈ మధ్యే నవాజుద్దీన్ సిద్ధిఖీ చిన్న సోదరి, తల్లి ఇద్దరూ మృతి చెందారు. ఈ కారణంగా ఆయన ముజఫర్ నగర్ జిల్లా బుధానాలోని సొంత ఇంట్లోనే ఉంటున్నట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం హోమ్ క్యారంటైన్‌లో ఉన్నానని.. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తున్నానని నవాజ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 

click me!