సంగీత శిఖరం మూగబోయింది.. పాట సెలవ్‌ తీసుకుంది

By Aithagoni RajuFirst Published Sep 25, 2020, 1:20 PM IST
Highlights

అవును ప్రముఖ లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గొంతు మూగబోయింది. ఆయన దాదాపు నలభై రోజులుగా కరోనాతో పోరాడి విశ్రమించారు. కరోనాతో చేసిన పోరాటంలో ఓడిపోయారు. 

ఆయన పాట మూగబోయింది. ఆయన గానం ఆగిపోయింది. ఆ మధురమైన పాట విశ్రమించింది. వేల పాటలతో శ్రోతలను ఐదున్నర దశాబ్దాలుగా మంత్రముగ్ధుల్ని చేసిన ఆ పాట విశ్రాంతి తీసుకుంది. అవును ప్రముఖ లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గొంతు మూగబోయింది. ఆయన దాదాపు నలభై రోజులుగా కరోనాతో పోరాడి విశ్రమించారు. కరోనాతో చేసిన పోరాటంలో ఓడిపోయారు. నిత్యం మన గుండెల్లో అద్భుతమైన పాటలతో ఒలలాడించిన బాలు పాట ఆగిపోయింది. ఆయన తిరిగిరాని లోకాలకు  వెళ్లిపోయారు. ఆయన  శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. 

Also Read:బాలు అత్యధికంగా జాతీయ అవార్డ్స్ ఎన్నిసార్లు అందుకున్నారంటే..!

సంగీతం ప్రపంచంలో ఇదొక చీకటి రోజు. ఓ సంగీత తార నెలకొరిగిన దుర్ధినం. శ్రోతాకాభిమానులను తీవ్ర శోకసంద్రంలోకి నెట్టివేసిన రోజు. అభిమానుల గుండెలు బద్దలైన రోజు. సంగీత ధృవతార అస్తమించిన రోజు. టోటల్‌గా ఇండియన్‌ సినీ పరిశ్రమకి, ముఖ్యంగా తెలుగు సినిమాకి చీకటి రోజు. 

Also Read:ఎంజీఎం ఆసుపత్రికి భారీగా తరలి వస్తోన్న ఫ్యాన్స్ .. అంత్యక్రియలు అక్కడే

ఎస్పీబాలు లేరనే వార్త ఇప్పుడు అభిమానులు, ఆడియెన్స్ నే కాదు, సాధారణ ప్రజలను కూడా దుఖసాగరంలో ముంచెత్తుతుంది. అయితే బాలు కరోనా కారణంగా గత నెల   మొదటి వారంలో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో జాయిన్‌ అయిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఆయన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఒకానొక టైమ్‌లో ఆయన ఆరోగ్యం మరింత విషమించిందన్నారు. ఐసీయూలో, వెంటిలేషన్‌పై, ఎక్మో విధానంలోనూ ట్రీట్‌ మెంట్‌ అందించారు. విదేశీ వైద్యులు సైతం ఆయనకు ట్రీట్‌మెంట్‌ చేశారు.  ఎంతో పోరాడిన  

ఆయన గత వారం రోజుల క్రితం కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్‌ పరీక్ష చేయగా నెగటివ్‌ వచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక బాలు కోలుకుంటారని అంతా భావించారు. తిరిగి ఆయనపాటలు పాడతారని, ఆయన పాటలు విని తరించిపోవాలని ఆశించారు. కానీ అందరి ఆశలపై నీళ్ళు చల్లుతూ `గురువారం రాత్రి` హఠాత్తుగా ఆయన ఆరోగ్యం మళ్లీ విషమించిందని వైద్యులు తెలిపారు.

Also Read:ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాణం ఆ మిత్రుడే

ఇక ఈ సారి ఆయన పోరాటం ఫలించలేదు. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. తన కోసం ఎన్నో మొక్కులు మొక్కిన అభిమానుల మొక్కులను వృధా చేస్తూ తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా బాలు నేపథ్యంలో చూస్తే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం.

చిన్నతనం నుంచే పాటలు పాడటం హాబీగా మార్చుకున్న బాలుకి.. తొలిసారిగా 1966లో విడుదలైన `శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న` చిత్రంలో పాడే అవకాశం వచ్చింది.

గాయకుడిగా కెరీర్ ప్రారంభించాక ఆయనకు పెద్ద స్టార్స్ కు పాడే అవకాశం రాలేదు. కేవలం అప్పుడే వస్తున్న అప్ కమింగ్ హీరోలకే పాడే అవకాశం మాత్రమే వచ్చేది. అప్పటికే ఎన్టీఆర్,  ఏన్నార్ లకు ఘంటసాల తప్ప ఎవరు పాడినా.. ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితి లేదు. అయిన అడపా దడపా ఘంటసాలతో గొంతు కలిపే పాడే అరుదైన అవకాశాలు వచ్చాయి. `ప్రతిరాత్రి వసంత రాత్రి.. ప్రతిగాలి పైర గాలి..` అంటూ `ఏకవీర`లో అమర గాయకుడు ఘంటసాలతో బాలు ఆలపించిన గానం నేటికి శ్రోతలను వెంటాడుతూనే ఉంటుంది.

Also Read:ఎస్బీ బాలు మొండి ఘటమే: సూపర్ స్టార్ కృష్ణతో వివాదం

అప్పట్నుంచి ఆయన పాటలతో బిజీ అయిపోయాడు. పైగా ఘంటసాల మరణం తర్వాత తెలుగు సినిమా పాటలకు బాలునే దిక్కు అయ్యాడు. సన్నివేశానికి న్యాయం  చేకూరుస్తూ.. సన్నివేశానికి తగ్గట్టుగా నటనను గాత్రంలో ప్రస్పుటంగా ప్రకటించగల గాయకుడు ఎప్పీ. ముఖ్యంగా బాలు సినీ జీవితం `శంకరాభరణం` సినిమాతో పూర్తిగా  మారిపోయింది. అప్పటివరకు మాస్ గీతాలకే పరిమితం అయిన బాలు ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలనని విమర్శకుల ప్రశంసలందుకున్నారు.  ఈ చిత్రానికి బాలు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నాడు. 

Also Read:బాలు గాత్రం నుంచి జాలువారిన ఎవర్‌గ్రీన్‌ సాంగ్స్

అప్నట్నుంచి బాలు రేంజే మారిపోయింది. ఏనాడూ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. అసలు ఆయనకంత టైమూ లేదు. తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటాడు బాలూ. హిందీలో తొలిసారి పాడిన `ఏక్ దూజేలియే` చిత్రంలో.. అద్భుతంగా పాడి అక్కడి వారిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ విధంగా తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రమణ్యానికే దక్కింది. 

Also Read:సంగీత శిఖరం మూగబోయింది.. పాట సెలవ్‌ తీసుకుంది

`చెల్లెలి కాపురం`లో `చరణ కింకరులు ఘల్లు ఘల్లు మన...కర కంకణములు గల గల లాడగా..` అంటూ బాలు తన గొంతులో పలికించిన వేరియేషన్స్ శ్రోతల మదిలో ఇప్పటికీ చిరస్తాయిగా నిలిచిపోయాయి. ఏ పాట పాడినా.. ఆ పాటకే అందం వచ్చేంతగా ఆలపించడం బాలుకి తప్పించి మరొకరికి సాధ్యం కాదు. భక్తి గీతాలను సైతం ఎంతో రసరమ్యంగా పాడటంలో ఆయనకు ఆయనే సాటి. ముఖ్యంగా `అన్నమయ్య`, `శ్రీరామదాసు`, `శ్రీరామరాజ్యం` చిత్రాలలో ఎస్పీ ఆలపించిన భక్తి గీతాలు ఇప్పటికీ ప్రతి ఇంటా వినిపిస్తూనే ఉన్నాయి. అవి ఎవర్‌ గ్రీన్‌ సాంగ్స్ గా నిలిచిపోయాయి. 

Also Read:ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం ముద్దు పేరేమిటో తెలుసా.....

గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడిగా, నటుడిగా, టి.వి వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా.. ఇలా బహుముఖ ప్రజ్ఞని ప్రదర్శించి తన విశ్వరూపం చూపించారు. సంగీత దర్శకుడిగా యాభై చిత్రాల వరకూ మ్యూజిక్ అందించాడు. నిర్మాతగా `ఆదిత్య369`, `శుభసంకల్పం`, `భామనే సత్యభామనే` వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను నిర్మించి తన అభిరుచి చాటుకున్నాడు. బాలసుబ్రమణ్యం పాటలు పాడుతుంటే వినేవారికి మాటలు రావు. `ఓ పాపా లాలి` చిత్రంలో `మాటేరాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు` అంటూ...బాలూ నటించి, ఆలపించిన బ్రీత్ లెస్ గీతం సంగీతాభిమానులు ఎప్పటికి మరిచిపోలేరు. 

Also Read:ఎస్పీ బాలుది రుక్మిణీ కల్యాణం: ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు

ఐదున్నర దశాబ్దాల సినీ కెరీర్‌లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతోపాటు ఉత్తరాధి భాషలు ఇలా ఇండియాకి చెందిన 17 భాషల్లో 41వేల 230 పాటలు ఆలపించి శ్రోతల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. పాట అంటే బాలు.. బాలు అంటే పాటే అనేలా ఆయన పాటల ఆడియెన్స్ మంత్రముగ్థుల్ని చేశాయి. ఐదున్నర దశాబ్దాలు ఆయనపాటలో మునిగి తేలేలా చేశాయి. 

Also Read:బాలసుబ్రహ్మణ్యం స్మోక్ చేసేవారు: కూతురి ఒక్క మాటతో...

ఐదున్నర దశాబ్దాల సినీ కెరీర్‌లో తెలుగు,తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతోపాటు ఉత్తరాధి భాషలు ఇలా ఇండియాకి చెందిన భాషల్లో నలభై వేలకుపైగా పాటలు ఆలపించి శ్రోతల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. పాట అంటే బాలు.. బాలు అంటే పాటే అనేలా ఆయన పాటల ఆడియెన్స్ మంత్రముగ్థుల్ని చేశాయి. ఐదున్నర దశాబ్దాలు ఆయనపాటలో మునిగి తేలేలా చేశాయి.

Also Read:గాన గాంధర్వుడి అరుదైన చిత్రమాలిక.. ఎప్పుడూ చూసి ఉండరు!
 

click me!