లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలు ఇకలేరు..శోక సంద్రంలో సినీలోకం

By Aithagoni RajuFirst Published Sep 25, 2020, 1:19 PM IST
Highlights

ప్రముఖ లెజెండరీ గాయకుడు ఎస్పీబాలసుబ్రమణ్యం ఇక లేరు. నలభై రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 

ప్రముఖ లెజెండరీ గాయకుడు ఎస్పీబాలసుబ్రమణ్యం ఇక లేరు. నలభై రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కరోనాతో చేసిన పోరాటంలో ఓడిపోయారు. అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తారు. భారతీయ చిత్రపరిశ్రమని విషాదంలో నింపారు.

కరోనా కారణంగా ఆగస్ట్ మొదటి వారంలో బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో జాయిన్‌ అయిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఆయన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఒకానొక టైమ్‌లో ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ఐసీయూలో, వెంటిలేషన్‌పై చికిత్స అందించారు. ఆ తర్వాత ఎక్మో విధానంలోనూ ట్రీట్‌ మెంట్‌ అందించారు. విదేశీ వైద్యులు సైతం ఆయనకు ట్రీట్‌మెంట్‌ చేశారు. ఎంతో పోరాటంతో ఆయన గత వారం రోజుల క్రితం కరోనా నుంచి నెగటివ్‌ పొందినట్టు వెల్లడించారు. ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. క్రమంగా ఆయన ఆరోగ్యం కోలుకుంటుందని, మాట్లాడుతున్నారని తెలిపారు.

కానీ గురువారం మళ్ళీ ఆయనకు మళ్లీ సీరియస్‌ అయ్యిందన్నారు. పరిస్థితి మరోసారి బాలు ఆరోగ్యం విషమించినట్టు, ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటనలో తెలిపారు. చాలా క్రిటికల్‌గా ఉందని తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. 

బాలు ఆరోగ్యం విషమించిందన్న వార్తతో సినీ ప్రముఖులు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుని ఆయన్ని పరామర్శించారు. కమల్‌ హాసన్‌ గురువారం రాత్రి ఆసుపత్రి చేసుకుని పరిస్థితి ఆరా తీశారు. బాలు కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో బాలు ఆరోగ్యం మరింత క్షీణించిందని, మరింత ఆందోళన కరంగా ఉందని అర్థమవుతుంది.  ఇప్పటికే బాలు కోలుకోవాలని తారాలోకం ప్రార్థనలు చేస్తుంది. 

సల్మాన్‌ ట్వీట్టర్‌ ద్వారా కోలుకోవాలన్నారు. `బలసుబ్రమణ్యం సర్‌..త్వరగా మీరు కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవుడిని ప్రార్థిస్తున్నా. నా కోసం ఎన్నో పాటలు పాడి నన్ను ఎంతో స్పెషల్‌గా మార్చినందుకు ధన్యవాదాలు. మీ `దిల్‌ దివానా హీరో ప్రేమ్‌.. లవ్‌ యూ సర్‌` అని ట్వీట్‌ చేశారు. 

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం బాలు ఆరోగ్యంపై ఆరా తీశారు. సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.తమన్‌ ఓ స్పెషల్‌ వీడియోని పంచుకున్నారు. `లాక్‌డౌన్‌కి ముందు మార్చి నెలలో నాకెంత్‌ ప్రియమైన మామాతో మేమంతా సరదాగా గడిపాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగడంలేదు. మామా దయజేసి త్వరగా కోలుకోండి. ఆయన ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించండి` అని ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. వీరితోపాటు హరీష్‌ శంకర్‌, రాధిక, ఖుష్బు, గీతా మాధురి, మంచు లక్ష్మీ, చిన్మయి, ప్రసన్న వంటి అనేక మంది తారలు బాలు కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్‌ చేశారు.

బాలుకి భార్య, కుమారుడు ఎస్పీ చరణ్‌, కుమార్తె పల్లవి ఉన్నారు. 

Also Read:

ఎస్బీ బాలు మొండి ఘటమే: సూపర్ స్టార్ కృష్ణతో వివాదం

బాలు గాత్రం నుంచి జాలువారిన ఎవర్‌గ్రీన్‌ సాంగ్స్

సంగీత శిఖరం మూగబోయింది.. పాట సెలవ్‌ తీసుకుంది

ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం ముద్దు పేరేమిటో తెలుసా.....

ఎస్పీ బాలుది రుక్మిణీ కల్యాణం: ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు

బాలసుబ్రహ్మణ్యం స్మోక్ చేసేవారు: కూతురి ఒక్క మాటతో...

గాన గాంధర్వుడి అరుదైన చిత్రమాలిక.. ఎప్పుడూ చూసి ఉండరు!

click me!