తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
10:58 PM (IST) Jul 17
నటుడు విజయ్ దేవరకొండ ఆసుపత్రిలో చేరారని వార్తలు వచ్చాయి. కింగ్‌డమ్ సినిమా విడుదలకు ముందు ఆయన అనారోగ్యానికి గురవ్వడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అయితే ఈ విషయంలో విజయ్ టీమ్ క్లారిటీ ఇచ్చారు.
10:01 PM (IST) Jul 17
ఆర్. మాధవన్ 21 రోజుల్లో బరువు తగ్గి ఫిట్ అయ్యారు. జిమ్, సర్జరీలు, మందులు లేకుండా, ఆహారం, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన దినచర్యతో మాధవన్ ఎలా ఇది సాధించారో తెలుసా?
08:57 PM (IST) Jul 17
కోట శ్రీనివాసరావుకు షూటింగ్ స్పాట్ లోనే వార్నింగ్ ఇచ్చింది సీనియర్ నటి వాణిశ్రీ. ఈ విషయాన్నిబాబుమోహన్ ఓసందర్భంలో వెల్లడించారు. ఇంతకీ కోటను వాణిశ్రీ ఏమన్నారు? ఎందుకన్నారు?
07:15 PM (IST) Jul 17
నూతన నటీనటులతో `కేరాఫ్ కంచరపాలెం` నటి ప్రవీణ పరుచూరి రూపొందించిన చిత్రం `కొత్తపల్లిలో ఒకప్పుడు`. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
07:07 PM (IST) Jul 17
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత మంది స్టార్ హీరోలు వదిలేసుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా మంచిమంచి సినిమాలు వదిలేసుకున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ముందున్నారు. ఆయన ఏకంగా 8 సినిమాలకుపైగా వదిలేసుకున్నట్టు తెలుస్తోంది.
07:03 PM (IST) Jul 17
హరిహర వీరమల్లు చిత్రానికి తాను ఎందుకు అంగీకరించాను అనే విషయాన్ని నిధి అగర్వాల్ తాజాగా రివీల్ చేశారు. ఈ చిత్రంలో ఛాలెంజింగ్ గా అనిపించిన అంశాలు కూడా పంచుకున్నారు.
05:30 PM (IST) Jul 17
అమరేంద్ర బాహుబలి, భల్లాల దేవుడు మధ్య ఫన్నీగా మాటల యుద్ధం జరిగింది. బాహుబలిని కట్టప్ప చంపకపోతే నేనే చంపేవాడిని అని రానా చెప్పడం.. దానికి ప్రభాస్ రిప్లై ఇవ్వడం వైరల్ అవుతోంది.
05:29 PM (IST) Jul 17
ఆగస్టు 29న జరగాల్సిన హీరో విశాల్, నటి సాయి ధన్సిక పెళ్లి వాయిదా పడింది. గతంలో కూడా పలు మార్లు విశాల్ పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. మరి విశాల్ పెళ్లి చేసుకునేది ఎప్పుడు ?
02:00 PM (IST) Jul 17
కన్నడ నటి రన్యా రావుకి బెంగళూరు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది మార్చిలో ఆమె దుబాయ్ నుంచి అక్రంగా బంగారం రవాణా చేస్తూ పట్టుబడ్డారు.
01:21 PM (IST) Jul 17
చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్ర హీరోలు నటించిన తొలి చిత్రాలు, అందులో నటించిన హీరోయిన్ల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. బాలయ్య తొలి చిత్ర హీరోయిన్ జీవితం విషాదంగా ముగిసింది అని తెలుసా ?
11:43 AM (IST) Jul 17
కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన విలాసవంతమైన అపార్ట్మెంట్ ని అమ్మేశారు. బాంద్రా వెస్ట్ లో ఉన్న ఈ అపార్ట్మెంట్ భారీ ధర పలికినట్లు తెలుస్తోంది.
09:48 AM (IST) Jul 17
ఒక సమయంలో శోభన్ బాబు.. జయసుధకు పందులు తిరిగే, దుర్వాసనతో కూడిన ఒక స్థలాన్ని కొనమని సలహా ఇచ్చారు. శోభన్ బాబు మాటలని పెడచెవిన పెట్టిన జయసుధ కొన్ని కోట్ల రూపాయల ఆస్తి సంపాదించుకునే అవకాశం కోల్పోయారు.
07:32 AM (IST) Jul 17
అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ కి పవన్ కళ్యాణ్ మూవీలో అవమానం ఎదురైంది. కెమెరామెన్ చేసిన పని వల్ల స్టార్ హీరోయిన్ బాగా అప్సెట్ అయ్యారట.