తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
09:32 PM (IST) Jul 03
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్ తో తండ్రి కొడుకులు నటించిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాని ఒకే హీరోయిన్ హీరోకు తల్లిగా, భార్యగా నటించిన సినిమా గురించి మీకు తెలుసా?
07:35 PM (IST) Jul 03
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ జూలై 4వ తేదీన గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సెన్సార్ పూర్తి అయ్యింది.
06:07 PM (IST) Jul 03
ఒకే ఒక్క వ్యక్తి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం తీసుకువచ్చాడు, నిర్మాతలకు చెమటలు పట్టించాడు. ఎట్టకేలకు ఆ వ్యక్తిని పక్కా ప్లాన్ తో పట్టుకున్నారు. ఇంతకీ ఎవరా వ్యక్తి, ఏంటా కథ.
04:53 PM (IST) Jul 03
ప్రస్తుతం టాలీవుడ్ కు పెద్దన్నలా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి, చాలా చిన్న స్థాయి నుంచి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి తన 45 ఏళ్ల కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లు చూశారు. అన్ని కష్టాలకు తట్టుకుని ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నారు మెగాస్టార్.
04:46 PM (IST) Jul 03
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించనున్నారు.
04:26 PM (IST) Jul 03
చిరంజీవి స్నేహానికి విలువిచ్చే మనిషి అని ఒక సీనియర్ హీరో అన్నారు. తాను ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు చిరంజీవి తీసుకున్న నిర్ణయం తనని భావోద్వేగానికి గురిచేసింది అని ఆయన పేర్కొన్నారు.
03:32 PM (IST) Jul 03
నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటిస్తున్న రామాయణం సినిమా ఫస్ట్ లుక్ ప్రోమో విడుదలైంది.
02:21 PM (IST) Jul 03
లోక నాయకుడు స్టార్ కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో దాదాపు 38 ఏళ్ళ తర్వాత వచ్చిన చిత్రం ‘థగ్ లైఫ్’. గత నెల జూన్ 5న థియేటర్స్ లో ఈ చిత్రం రిలీజ్ అయింది.
01:19 PM (IST) Jul 03
హరిహర వీరమల్లు చిత్రం హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కింది. మొగల్ సామ్రాజ్యాన్ని వణికించిన వీరుడిగా హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు.
11:35 AM (IST) Jul 03
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా హరిహర వీరమల్లు చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.ఎట్టకేలకు ఫ్యాన్స్ కోరుకునే మూమెంట్ వచ్చేసింది. ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 2 నిమిషాల 57 సెకన్ల నిడివితో ట్రైలర్ రిలీజ్ అయింది.
10:19 AM (IST) Jul 03
నేడు జూలై 3 న ఆయన జయంతి కావడంతో ఎస్వీ రంగారావు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
08:36 AM (IST) Jul 03
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించిన వివాదం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి అనుభవమే ఓ చిత్రంతో ఎదురైంది.
07:09 AM (IST) Jul 03
గతంలో హీరోయిన్ గా రాణించిన పూనమ్ కౌర్ ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటుంది. అయితే ఆమె తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.