తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
10:52 PM (IST) May 24
ముఖ్యంగా, రష్మిక అందమైన ముఖం, చక్కని చిరునవ్వు ఆమెకు ప్లస్ పాయింట్. కన్నడ సినిమా ఇండస్ట్రీలో తప్ప, ఎక్కడా ఆమె గురించి చెడు అభిప్రాయం లేదు.
09:34 PM (IST) May 24
కాన్స్ 2025: ఎడ్ వెస్ట్విక్, అమీ జాక్సన్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో amfAR గాలాలో బ్లాక్ డ్రెస్ లో మెరిశారు. వీరిద్దరి కెమిస్ట్రీ ఆకర్షణగా నిలిచింది.
08:53 PM (IST) May 24
ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలు కీలక దశలో ఉన్నాయి. అయితే మిస్ వరల్డ్ పోటీలపై చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. ముఖ్యంగా ఏ ప్రాతిపదికన విజేతని ప్రకటిస్తారు అనే అంశంలో చాలామందికి సందేహాలు ఉంటాయి.
07:50 PM (IST) May 24
స్వయంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో స్పిరిట్ చిత్రంలో నటించబోయే హీరోయిన్ ని ప్రకటించారు.
07:07 PM (IST) May 24
78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మొదటిసారి ఎంట్రీ ఇచ్చింది అలియా భట్. అక్కడ ట్రెండీ దుస్తులు ధరించి హోయలు పోయింది. రెడ్ కార్పెట్‌పై మెరిసి ఆకట్టుకుంది.
06:55 PM (IST) May 24
అజిత్, కమల్ హాసన్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించిన నటి కిరణ్ రాథోడ్ తాజాగా వార్తల్లో నిలిచారు. మార్ఫింగ్ చేయబడిన ఆమె అశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
06:46 PM (IST) May 24
రవితేజ హీరోగా వచ్చిన `కృష్ణ` చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించిన నటుడు ముకుల్ దేవ్ మరణించారు. ఈ సందర్భంగా ఆయన వంద కోట్ల చిత్రాల గురించి తెలుసుకుందాం.
06:22 PM (IST) May 24
విజయ్ సేతుపతి హీరోగా నటించిన `ఏస్` మూవీ శుక్రవారం విడుదలై ఆకట్టుకుంటుంది. కానీ గత వారం విడుదలైన సూరి మూవీ విజయ్‌కి షాకిస్తుంది.
06:00 PM (IST) May 24
తెలుగు చిత్రపరిశ్రమకి డిప్యూటీ సీఎం వార్నింగ్ ఇచ్చారు. థియేటర్ బంద్ విషయం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రకటన రచ్చ లేపుతుంది.
05:46 PM (IST) May 24
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ క్లారిటీ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
05:06 PM (IST) May 24
విజయ్ నటిస్తున్న 'జననాయకన్' సినిమా షూటింగ్ జూన్ నెలతో పూర్తవుతుందని అంచనా. అయితే ఈ మూవీ నుంచి టీమ్ సుమారు వెయ్యి కోట్లు ఆశిస్తున్నారు. మరి అది సాధ్యమవుతుందా?
04:26 PM (IST) May 24
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమా మేకింగ్ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది.
02:58 PM (IST) May 24
`మిస్ వరల్డ్ 2025` పోటీలు హైదరాబాద్ వేదికగా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. మే 31న గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది. అయితే మిస్ వరల్డ్ విన్నర్‌కి ఎంత ప్రైజ్‌మనీ వస్తుందనే వివరాలు బయటకు వచ్చాయి.
01:16 PM (IST) May 24
బాలు, షిన్నోవా, సాన్విత ప్రధాన పాత్రల్లో, సత్య బొత్స దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ఒక బృందావనం`. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
11:26 AM (IST) May 24
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో 38 ఏళ్ల క్రితం `నాయకుడు` సినిమా వచ్చింది. అయితే ఈ మూవీ సెట్ కావడం వెనుక క్రేజీస్టోరీ ఉందట. ఆ విషయాన్ని మణిరత్నం బయటపెట్టారు
09:37 AM (IST) May 24
విశాల్, సాయి ధన్సిక త్వరలో ఒక్కటి కాబోతున్నారు. ఇటీవల తమ పెళ్లి డేట్‌ని కూడా ప్రకటించారు. ఈ క్రమంలో హీరోయిన్ సాయి ధన్సిక తెలుగులో నటించిన సినిమాలేంటో తెలుసుకుందాం.
08:26 AM (IST) May 24
మెగాస్టార్ చిరంజీవిపై హీరో జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక దుర్మార్గుడు అని, `ఘారానా మొగుడు` సినిమా షూటింగ్‌లో చిరు చేసిన పని బయటపెట్టాడు.
07:23 AM (IST) May 24
సహజనటి జయసుధ కెరీర్ బిగినింగ్‌లో ఓ యాడ్ చేసింది. అది తన ఫస్ట్ యాడ్. అది కూడా లుంగీ యాడ్ కావడం విశేషం. దీనికి సంబంధించిన ఒక అరుదైన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.