కూలిన ఆఫీస్‌ చూసి కంగనా కన్నీళ్ళు.. ఉద్ధవ్‌ ఠాక్రేకి వార్నింగ్‌

By Aithagoni RajuFirst Published Sep 11, 2020, 8:13 AM IST
Highlights

కూల్చివేయబడ్డ తన ఆఫీస్‌ చూసి కంగన కన్నీళ్ళు పెట్టుకుంది. తన ఆఫీస్‌ ధ్వంసమైన విధానం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. 

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మహారాష్ట్ర ప్రభుత్వాన్నే వణికిస్తుంది. మరోవైపు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం కంగనాని అణచివేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ముంబయికి చెందిన బీఎంసీ అధికారులు బుధవారం ముంబయిలోని తన కార్యాలయాన్ని కూల్చేసిన విషయం తెలిసిందే. కంగనా హైకోర్ట్ కెళ్ళి స్టే తేవడంతో తాత్కాలికంగా కూల్చివేత నిలిపివేశారు. 

దీనిపై కంగనా మండి పడ్డారు. అంతేకాదు అనేక మంది సెలబ్రిటీలు ఆమెకి మద్దతుగా నిలిచారు. బీజేపి నాయకులు కంగనాకి మద్దతు ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ఈ వివాదం పెద్ద దుమారం రేపుతుంది. ముంబయి మొత్తం ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఇదిలా ఉంటే కూల్చివేయబడ్డ తన ఆఫీస్‌ చూసి కంగన కన్నీళ్ళు పెట్టుకుంది. తన ఆఫీస్‌ ధ్వంసమైన విధానం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై కంగనా ఘాటుగా స్పందించింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రేని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, ఈ రోజు నా ఇల్లు కూల్చివేశారు.. రేపు మీ అహంకారం విరిగిపోతుందని మండిపడ్డారు. 

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో కంగనా రనౌత్‌ నెపోటిజం, డ్రగ్స్ మాఫియా, ముంబయి పోలీసులపై అనేక ఆరోపణలు చేశారు. దీంతో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆమెపై మండిపడ్డారు. ముంబయికి రావద్దంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ముంబయిని పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లా పోల్చింది కంగనా. దీంతో వీరి మధ్య మాటల యుద్ధం పెరగడంతో కేంద్రం ఆమెకి `వై ప్లస్‌` కేటగిరి భద్రతని కల్పించింది.  

click me!