కాజల్‌ `ఎస్‌` చెప్పింది..ప్రియుడు అతనే.. మ్యారేజ్‌ ఎప్పుడంటే?

Published : Oct 06, 2020, 12:07 PM IST
కాజల్‌ `ఎస్‌` చెప్పింది..ప్రియుడు అతనే.. మ్యారేజ్‌ ఎప్పుడంటే?

సారాంశం

గత కొంత కాలంగా కాజల్‌ ఓ ముంబయికి చెందిన బిజినెస్‌ మ్యాన్‌తో ప్రేమలో ఉందని, పెళ్ళికి రెడీ అవుతుందనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తరచూ ఈ వార్తలు గుప్పుమన్నాయి. ఎట్టకేలకు ఇన్నాళ్ళు సీక్రెట్‌గా ఉంచిన ఈ చందమామ ఎట్టకేలకు రివీల్‌ చేసింది.

కాజల్‌ `ఎస్‌` చెప్పింది.. తనపై వస్తోన్న రూమర్లకి `ఎస్‌` చెప్పింది. చాలా రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తలకు `ఎస్‌` చెప్పింది. తన ప్రియుడికి `ఎస్‌` చెప్పింది. ఫైనల్‌గా మ్యారేజ్‌కి `ఎస్‌` చెప్పింది. అవును కాజల్‌ `ఎస్‌` చెప్పింది. 

గత కొంత కాలంగా కాజల్‌ ఓ ముంబయికి చెందిన బిజినెస్‌ మ్యాన్‌తో ప్రేమలో ఉందని, పెళ్ళికి రెడీ అవుతుందనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తరచూ ఈ వార్తలు గుప్పుమన్నాయి. ఎట్టకేలకు ఇన్నాళ్ళు సీక్రెట్‌గా ఉంచిన ఈ చందమామ ఎట్టకేలకు రివీల్‌ చేసింది. ఇంటీరియర్‌ డిజైనర్‌ కంపెనీ అధినేత గౌతమ్‌ కిచ్లుని ప్రేమిస్తున్నట్టు, ఆయన్ని పెళ్ళి చేసుకోబోతున్నట్టు పేర్కొంది. 

ఈ నెల 30న మ్యారేజ్‌ వేడుక జరగబోతుందని సడెన్‌గా చెప్పేసి ఆడియెన్స్ కి, తన అభిమానులకే కాదు, సినీ వర్గాలకు షాక్‌ ఇచ్చింది. కాజల్‌ తాజాగా మంగళవారం ఓ ప్రకటనని తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకుంది. 

ఇందులో `ఎస్`‌.. ఈ వార్తని పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉన్నానని చెబుతూ, గౌతమ్‌ కిచ్లుతో మ్యారేజ్‌ ఈ నెల 30న ముంబయిలో జరగబోతుందని, అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సెలబ్రిటీల మధ్య చిన్నగా, ప్రైవేట్‌గా తమ మ్యారేజ్‌ జరగబోతున్నట్టు పేర్కొంది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకుందని చెప్పింది. 

గౌతమ్ తో తాను చాలా హ్యాపీగా ఉంటుందట, ఆయనతో జీవితాన్ని పంచుకోవడానికి థ్రిల్‌గా ఉందట. ఇన్నాళ్ళు తనపై ప్రేమని, అభిమానాన్ని పంచిన ఆడియెన్స్, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. మున్ముందు కూడా ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేస్తుందట. సో ఈ లెక్కన పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీ సినిమాలు చేస్తుందని చెప్పకనే చెప్పేసింది. 

కాజల్‌ పంచుకున్న ఈ లేఖతో ఆమె అభిమానులు తెగ బాధపడుతున్నారు. `ఉన్నట్టుండి ఇలా మధ్యలో వదిలేసిపోతే ఎలా..` అంటూ, `మమ్మల్ని ఒంటరి చేశావా..`, `మా ఆశలపై నీళ్ళు చల్లావా` అంటూ ఎమోషనల్‌ అవుతున్నారు. బాధతాప్త హృదయాలతో విశెష్‌ చెబుతున్నారు. ఎక్కడ ఉన్న సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌