సైరా ట్రైలర్ సీక్వెన్స్ ఇదే: 'అతను ఒక యోగి.. అతను ఒక యోధుడు.. ఎవరూ ఆపలేరు'

Published : Sep 18, 2019, 04:19 PM IST
సైరా ట్రైలర్ సీక్వెన్స్ ఇదే: 'అతను ఒక యోగి.. అతను ఒక యోధుడు.. ఎవరూ ఆపలేరు'

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ట్రైలర్ పై ఉత్కంఠ తారాస్థాయికి చేరుతోంది. మరికొన్ని నిమిషాల్లోనే సైరా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సాయంత్రం 5:31 గంటలకు ట్రైలర్ రిలీజ్ ముహూర్తం నిర్ణయించారు. మెగాస్టార్ మాస్ అప్పీయరెన్స్ రోమాలు నిక్కబొడుకునేలా ఉండబోతున్నట్లు టాక్. 

సైరా ట్రైలర్ విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానుల సంబరాలు ఒకరేంజ్ లో సాగుతున్నాయి. తమకు తెలిసిన సైరా విశేషాలు చర్చించుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా విశ్వసనీయ వర్గాల నుంచి సైరా ట్రైలర్ పై ఓ ఆసక్తికర విషయం మాకు తెలిసింది. 

సైరా టీజర్ కు చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించారు. ట్రైలర్ లో కూడా పవన్ వాయిస్ ఓవర్ ఉండనుంది. సైరా ట్రైలర్ ని సురేందర్ రెడ్డి పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం కట్ చేశారట. దాదాపు మూడు నిమిషాల పాటు సైరా ట్రైలర్ సాగుతుంది. 

ట్రైలర్ లో మొదట ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి ఎంట్రీ ఇస్తారు. ఆ వెంటనే ఆయన గురువు పాత్రలో బిగ్ బి అమితాబ్ పాత్ర పరిచయం ఉంటుంది. ఆ తర్వాత తమన్నా పాత్ర, ఆమె నటించిన యాక్షన్ సన్నివేశాలని చూస్తారు. అదే సమయంలో నరసింహారెడ్డి భార్యగా నయనతార ఎంట్రీ ఇస్తుంది. 

ఆ తర్వాత నరసింహారెడ్డి అంటే ఈర్ష్య పడే అతడి సోదరుడి పాత్రలో జగపతి బాబు కనిపిస్తాడు. జగపతి బాబు పాత్ర పరిచయం తర్వాత ట్రైలర్ లో వార్ సన్నివేశాలు ప్రారంభం అవుతాయి. వార్ ఎపిసోడ్స్ లోనే కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి పాత్రల పరిచయం ఉంటుంది. 

వార్ జరుగుతుండగానే చిరంజీవి ఎలివేషన్ షాట్స్, పంచ్ డైలాగ్స్ ఉంటాయి. ఇక ట్రైలర్ లో హైలైట్ గా నిలిచే అంశాలలో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ కూడా ఒకటి. పవన్ తన వాయిస్ ఓవర్ ద్వారా నరసింహారెడ్డి గురించి అద్భుతమైన డైలాగ్ చెబుతాడు. 'అతను ఒక యోగి.. అతను ఒక యోధుడు.. అతనిని ఎవరూ ఆపలేరు' అని పవన్ వాయిస్ ఓవర్ లో ఈ డైలాగ్ చెబుతాడు. 

ట్రైలర్ చివర్లో ఝాన్సీ లక్ష్మీ బాయిగా అనుష్క పాత్ర పరిచయం.. అండర్ వాటర్ ఫైట్ కి సంబంధించిన షాట్స్ ఉండనున్నాయి. 

దయచేసి ఆ సీన్ ట్రైలర్ లో చూపించొద్దు.. వేడుకుంటున్న మెగా ఫ్యాన్స్!

'సైరా' ప్రీరిలీజ్ బిజినెస్.. దిల్ రాజు సహా ఎవరెవరంటే!

బాంబులా పేలిన 'సైరా' డిజిటిల్ రైట్స్ ధర.. వామ్మో ఇంతా!

మెగా ఫ్యాన్స్ లో కలవరం.. వెనుకబడ్డ 'సైరా' ప్రమోషన్స్

బాహుబలిని మించిపోయిన 'సైరా'!

మెగాస్టార్ ఉగ్రరూపం.. థియేటర్లలో సైరా ట్రైలర్!

అఫీషియల్: 'సైరా' ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా.. కారణం ఇదే!

PREV
click me!

Recommended Stories

Suma Kanakala : రోడ్డు మీద బుక్స్ అమ్మే వాడిలా ఉన్నావు.. స్టార్ డైరెక్టర్ ను అవమానించిన యాంకర్ సుమ
Karthika Deepam 2 Today Episode: దాసును ఆపిన కార్తీక్- తప్పించుకున్న జ్యో- విడాకులకు సిద్ధమైన స్వప్న