వార్ తో ఢీ: హిందీలోనూ సైరా హైప్, నడుం బిగించిన సల్మాన్

By Prashanth MFirst Published Sep 18, 2019, 4:04 PM IST
Highlights

250కోట్లతో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ డ్రామా సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2వ తేదీన మనముందుకు వస్తుంది. చాలాగ్యాప్ తరువాత చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

250కోట్లతో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ డ్రామా సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2వ తేదీన మనముందుకు వస్తుంది. చాలాగ్యాప్ తరువాత చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ సినిమా ట్రైలర్ ని వాస్తవానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లాంచ్ చేయవలిసి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించని కారణంగా 22వ తేదికి వాయిదావేశారు. 

ఇంకో 13 రోజుల్లో సినిమా విడుదలవబోతుంటే,ఇంకా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టలేదని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్, ఇది ఒక మరుగునపడ్డ రేనాటి చోళుని వీరగాథ కాబట్టి ఇక్కడ బజ్ కు వచ్చిన కొదవేమీ లేదు. దానికితోడు నేటి ట్రైలర్ లాంచ్ భారీగా ఉండడంతో థియేటర్లవద్ద ఫ్యాన్స్ కోలాహలం హైప్ ను ఖచ్చితంగా పెంచుతాయి. 

కాకపోతే హిందీలో ఇదే అక్టోబర్ 2వ తేదీన వార్ సినిమా రిలీజ్ అవుతోంది. యాష్ రాజ్ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకుంది. వారిచేతిలో సహజంగానే చాలా థియేటర్లు ఉండడంతో హిందీలో బజ్ క్రియేట్ చేయవలిసిన అవసరం ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత చిత్ర ప్రమోషన్ పనులను వేగవంతం చేసేందుకు రామ్ చరణ్ ఆలోచిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. 

ఈ గ్యాప్ ను కూడా ఎలావాడుకోవాలో ఒక పక్కా ప్రణాలికను సైరా బృందం  రచించారని అర్థమౌతుంది. ఇందులో భాగంగానే నిన్నటినుండి హిందీ పరిశ్రమకుచెందిన ప్రముఖులు సైరా ట్రైలర్ లాంచ్ సందర్భంగా తెగ ట్వీట్లు పెడుతున్నారు. తరుణ్ ఆదర్శ్ నుంచి కోమల్ నాహతా వరకు ఎందరో సినిమా పండితులు, ట్రేడ్ అనలిస్టులు ట్వీట్ చేస్తున్నారు. 

ఒకరకంగా డైరెక్ట్ గా చిత్ర యూనిట్ వెళ్లి అక్కడ ప్రమోషన్లు ఆరంభించక ముందే బజ్ క్రియేట్ చేయడంలో రామ్ చరణ్ సక్సెస్ అయ్యాడు. 

ఇప్పటికే సల్మాన్ ఖాన్ సైతం సైరా ప్రమోషన్ లలో పాల్గొనబోతున్నట్టు తెలిపాడు. బిగ్ బి అమితాబ్ కూడా ఇందులో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. సో బిగ్ బి క్రేజ్ న్యాచురల్ గా కలిసొచ్చే అంశమే. మొత్తానికి సోషల్ మీడియాద్వారా  బాలీవుడ్  లోసైతం బజ్ క్రియేట్ చేయడంలో టీం సైరా సక్సెస్!

click me!