'వాల్మీకి’ టైటిల్ పై బీజేపీ అధ్యక్షుడి డిమాండ్

Published : Sep 18, 2019, 04:09 PM IST
'వాల్మీకి’ టైటిల్ పై బీజేపీ అధ్యక్షుడి డిమాండ్

సారాంశం

వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం 'వాల్మీకి'.  అయితే మరో రెండు రోజుల్లో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా టైటిల్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం ఈ టైటిల్ పై అభ్యంతరం తెలిపారు.

వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం 'వాల్మీకి'.  అయితే మరో రెండు రోజుల్లో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా టైటిల్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం ఈ టైటిల్ పై అభ్యంతరం తెలిపారు.

కన్నా  మాట్లాడుతూ, సినిమాకు వాల్మీకి అని పేరు పెట్టడం వల్ల కొందరి మనోభావాలు దెబ్బతింటాయని చెప్పారు. వాల్మీకి చిత్రం పేరును వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే క్రైమ్ సినిమాకు ఈ టైటిల్ పెట్టి తమ కులాన్ని అవమానిస్తున్నారని వదిలేది లేదంటున్నారు బోయ కులస్దులు.  వాల్మీకి పేరు అనేది ఎలా పడితే అలా వాడుకునేది కాదంటూ కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చారు.

కొద్ది రోజుల క్రితం వాల్మీకి సినిమా టైటిల్‌ను మార్చాలని కోరుతూ  సీజీఓ టవర్స్‌లోని సెన్సార్‌ బోర్డు కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్,  భజరంగ్‌దళ్‌ నాయకులు ధర్నా నిర్వహించారు.  వాల్మీకి బోయలతో పాటు హిందువుల ఆరాధ్య దైవమని పేర్కొన్నారు.  అలాంటి మహనీయుడి పేరు మీద సినిమా తీయడం సరైంది కాదన్నారు. వెంటనే సినిమా పేరును మార్చాలని భజరంగ్‌దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఎం.సుభాశ్‌చందర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సెన్సార్‌ బోర్డు చైర్మన్‌కు రాసిన లేఖను విడుదల చేశారు.

ఈ విషయమై  దర్శకుడు హరీష్ శంకర్  మాట్లాడుతూ...  ‘వాల్మీకిని పూజించిన రాముడు కూడా ధర్మం కోసం ఫైటింగ్‌ చేశాడు. ఏదేమైనప్పటికీ మేం వాల్మీకి సంఘం అభిప్రాయాల్ని గౌరవిస్తాం. ఈ సినిమాలో హీరో పేరు వాల్మీకి కాదని ముందే చెబుతున్నా. కాబట్టి గొప్ప వాల్మీకి పేరును మా హీరోకు పెట్టలేదు’ అని హరీష్‌ ట్వీట్లు చేశారు.

‘వాల్మీకి’ సినిమాలో పూజా హెగ్డే  హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ దీనిని నిర్మిస్తోంది. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందిస్తున్నారు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు తెలుగు రీమేక్‌ ఇది.ఈ నెల 20 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

PREV
click me!

Recommended Stories

Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే
Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్