చివరికి రజనీకాంత్‌తోనే ప్రభాస్‌ ఫైట్‌ చేయాల్సిన పరిస్థితి వస్తుందిగా ?

By Aithagoni RajuFirst Published Nov 4, 2022, 6:54 PM IST
Highlights

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మధ్య ఫైట్‌ జరగబోతుందని సమాచారం. ఇప్పుడొస్తున్న వార్తే నిజమైతే ఇద్దరు ఫైట్‌ చేయాల్సి వస్తుంది. 

`బాహుబలి` తర్వాత ప్రభాస్‌పై అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. పాన్‌ ఇండియా హీరో కావడంతో ఆయన నుంచి వచ్చే సినిమాపై ఆసక్తి నెలకొంది. కానీ `బాహుబలి` తర్వాత ఆయన నటించిన సినిమాలు రెండు డిజప్పాయింట్‌ చేశాయి. దీంతో ఇప్పుడు `ఆదిపురుష్‌`తో రాబోతున్నారు ప్రభాస్‌. రామాయణం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. బాలీవుడ్‌ దర్శకుడు ఓ రౌత్‌ దీన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. భారీ విజువల్స్ నేపథ్యంలో లార్జ్ స్కేల్ ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. 

అయితే ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఇప్పుడు వాయిదా పడిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమా సంక్రాంతికి రావడం లేదని ఏప్రిల్ మేలో వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఏప్రిల్‌ 28న రావాలనుకుంటున్నారట. ఆ దిశగా ప్లాన్‌ జరుగుతుందట. అది కరెక్ట్ టైమ్‌ అని భావిస్తున్నారట. `బాహుబలి 2` ఇదే డేట్‌కి వచ్చింది. అది సంచనాలకు కేరాఫ్‌గా నిలిచింది. `ఆదిపురుష్‌`ని కూడా అదే తేదీని విడుదల చేయాలనే ఆలోచనలో యూనిట్‌ ఉందనిటాక్‌. 

ఇదిలా ఉంటే అదే డేట్‌కి రజనీకాంత్‌ రాబోతున్నారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ `జైలర్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉంది. తమన్నా ఇందులో హీరోయిన్‌ అని టాక్‌. ఈ సినిమాని ఏప్రిల్‌ 28నే విడుదల చేయబోతున్నారట. ఈ చిత్రం కూడా తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ డబ్బింగ్‌ వెర్షన్‌ విడుదలవుతుంది. రజనీ సినిమా వాయిదాపడే అవకాశం లేదు. 

ఇదే జరిగితే బాక్సాఫీసు వద్ద ప్రభాస్‌, రజనీ ఢీ కొట్టాల్సి వస్తుంది. ఫస్ట్ టైమ్‌ ఇద్దరు పాన్‌ ఇండియాసూపర్‌ స్టార్లు బాక్సాఫీసు ఫైట్‌కి సిద్ధపడాల్సి వస్తుంది. ఇద్దరికీ ఈ రెండు చిత్రాలు చాలా ప్రతీష్టాత్మకమైనవి. ఇద్దరికి హిట్లు కావాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడీ ఫైట్‌ యమ రంజుగా మారబోతుంది. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఇదే టైమ్‌లో `పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్ 2` రాబోతుందట. మొదట వాళ్లు కూడా ఏప్రిల్‌ 28నే రిలీజ్‌ చేయాలనుకున్నారని, కానీ రెండు వారాలు ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదే జరిగితే ఫైట్‌ తగ్గిపోతుంది. లేదంటే థియేటర్ల కోసం, కలెక్షన్ల కోసం మూడు సినిమా పోటీ పడాల్సి వస్తుంది. ఇది మూడు సినిమాలకు తీవ్ర నష్టాన్ని తీసుకొస్తాయని చెప్పొచ్చు. 
 

click me!