రాజ్‌కుంద్రా పోర్న్ చిత్రాల కేసు: 'లక్స్ పాప' స్టేట్మెంట్

By Surya PrakashFirst Published Jul 27, 2021, 1:08 PM IST
Highlights

పోర్న్ చిత్రాల కేసులో పలువురు పేర్లు బయటకు వస్తున్నాయి. దాంతో చాలా మంది బాలీవుడ్ స్టార్స్ భయపడుతున్నారు. కొందరు తాము మొదటి నుంచీ రాజ్ కుంద్రాకు దూరంగా ఉన్నామని చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ నరసింహనాయడులో.. 'లక్స్ పాప' గా నటించిన ఆశా షైనీని టాలీవుడ్ ప్రేక్షకులు ఎవరైనా మరిచిపోగలరా? అయితే.. అందం ట్యాలెంట్ రెండూ ఉన్న ఈ భామకు అవకాశాలు అంతగా కలిసి రాలేదు. తర్వాత రకరకాలుగా పేర్లు మార్చేసుకుని బాగానే ట్రై చేసింది. మయూరి.. ఫ్లోరా షైనీ(అసలు పేరు)గా మారిన తర్వాత.. మళ్లీ ఆశా షైనీ దగ్గరే సెటిల్ అయింది. ఇప్పుడు ఆమె వార్తల్లోకు ఎక్కింది.

రాజ్‌కుంద్రా అశ్లీల చిత్రాల కేసు నేపథ్యంలో అనేక మంది  పేర్లు బయటకు వస్తుండటంతో ఎవరికి వారు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగులో లక్స్ పాపగా పేరు తెచ్చుకున్న  నటి ఫ్లోరా సైనీ స్పందించారు. తానెప్పుడూ రాజ్‌కుంద్రాను కలవలేదని చెప్పుకొచ్చారు.

ప్లోరా సైనీ మాట్లాడుతూ.. ‘ఈ విషయంలో నేను స్పందించకుండా ఉంటే నేనేదో దాస్తున్నట్లు అందరూ అనుకుంటారు. ఇద్దరు వ్యక్తులు వాట్సాప్‌లో ఛాటింగ్‌ చేసుకుంటూ నా పేరు ప్రస్తావన తీసుకొచ్చినంత మాత్రాన తాను వాళ్లను కలిసి పనిచేసినట్లు కాదు. నటిగా నేను పలు సన్నివేశాల్లో నటించి ఉండవచ్చు. కానీ, ఆ తర్వాత అలాంటి సినిమాలకు దూరంగా ఉంటున్నా’’ అని చెప్పుకొచ్చారు. 

మరో ప్రక్క మోడల్‌, నటి షెర్లి చోప్రాకు సమన్లు అందాయి. అశ్లీల చిత్రాలను తెరకెక్కించి, యాప్‌లలో అప్‌లోడ్‌ చేస్తున్నారన్న ఆరోపణలపై వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో సంబంధాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటి షెర్లిన్‌ చోప్రాను కూడా విచారించనున్నారు. ఈ మేరకు ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ ప్రాపర్టీ సెల్‌ పోలీసులు ఆమెకు సమన్లు పంపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆమె విచారణకు హాజరుకావాల్సిందిగా అందులో పేర్కొన్నారు.

మరోవైపు రాజ్‌కుంద్రాకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ముంబయి పోలీసులు సీజ్‌ చేస్తున్నారు. కాన్పూర్‌లోని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా శాఖలో రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిలకు ఉన్న ఖాతాలను స్తంభింపచేయాలని ఎస్‌బీఐకి సూచించారు. తాము 20-25 నిమిషాల నిడివితో షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసినట్లు ఈ కేసుతో సంబంధం ఉన్న దర్శకుడు తన్వీర్‌ హష్మి ఒప్పుకొన్నారు.
 

click me!