త్రివిక్రమ్‌కి హీరోయిన్లే కాదు.. మరో సెంటిమెంట్‌ కూడా ఉందట..

By Aithagoni RajuFirst Published Aug 30, 2021, 2:54 PM IST
Highlights

తన తొలి రూమ్‌ సెంటిమెంట్‌ కూడా ఉందట త్రివిక్రమ్‌కి. సినిమాల్లో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో నటుడు సునీల్‌, దర్శకుడు దశరథ్‌ కలిసే రూమ్‌లో ఉన్నారు. అద్దె రూమ్‌లో చాలా సంవత్సరాలున్నారు.

చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లకి విలువెక్కువ. హీరోల సెంటిమెంట్‌, హీరోయిన్ల సెంటిమెంట్‌, సన్నివేశాల సెంటిమెంట్‌, ఆర్టిస్టుల సెంటిమెంట్‌ ఇలా చాలా రకాల సెంటిమెంట్లు ఫాలో అవుతుంటారు దర్శక, నిర్మాతలు. ఈ విషయంలో హీరోలు తక్కువేం కాదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఓ సెంటిమెంట్‌ ఉందట. ఆయన ఇటీవల హీరోయిన్ల విషయంలో సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నాడు. పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ హిట్‌ అవుతున్న నేపథ్యంలో బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆమెని తన సినిమాల్లో రిపీట్‌ చేస్తున్నాడు. 

మరోవైపు తన తొలి రూమ్‌ సెంటిమెంట్‌ కూడా ఉందట త్రివిక్రమ్‌కి. సినిమాల్లో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో నటుడు సునీల్‌, దర్శకుడు దశరథ్‌ కలిసే రూమ్‌లో ఉన్నారు. అద్దె రూమ్‌లో చాలా సంవత్సరాలున్నారు. అయితే తనకు లైఫ్‌ ఇచ్చింది అదే రూమ్‌ అని త్రివిక్రమ్‌ నమ్ముతారట. పంజాగుట్టలోని సాయిబాబా ఆలయానికి సమీపంలో ఉండే ఓ చిన్న గదిలో అద్దెకు ఉండేవారు. అక్కిడి నుంచే త్రివిక్రమ్‌ ఎన్నో సినిమాలకు కథలు అందించారు.

`స్వయంవరం`, `సముద్రం`, `నిన్నే ప్రేమిస్తా`, `నువ్వే కావాలి`, `చిరునవ్వుతో`, `నువ్వు నాకు నచ్చావ్` లాంటి  సినిమాలకు ఆ ఇంట్లోనే ఉంటూ త్రివిక్రమ్‌ మాటలు అందించారు. ఆ తర్వాత ఆయన దర్శకుడిగా మారి పలు సూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. అయినా  తనకు మొదట ఆశ్రయం ఇచ్చిన ఆ అద్దె ఇల్లు అంటే త్రివిక్రమ్‌కు ఎంతో మమకారమట.

అందుకే ఆ ఇంటిని వదులుకోలేక ప్రతి నెల ఐదు వేల రూపాయల అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా సెంటిమెంట్‌గా ఇప్పటికీ కొన్ని సినిమాలకు అక్కడి నుంచే కథలు, మాటలు రాస్తారట. ప్రస్తుతం త్రివిక్రమ్‌కు సొంతంగా ఓ విలాసవంతమైన ఇల్లు ఉన్నా నేటికీ ఆ అద్దె ఇంటిని సెంటిమెంట్‌గా భావించి అప్పుడప్పుడు అక్కడికి వస్తారని సమాచారం. ఎంత ఎదిగినా, మూలాలు మర్చిపోకపోవడమంటే ఇదే మరి. 

click me!