రజనీ, కమల్‌, విజయ్‌, సూర్యకి సాధ్యం కాలేదు.. ధనుష్‌ సాధించారు..

By Aithagoni RajuFirst Published Jul 18, 2021, 3:32 PM IST
Highlights

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, దళపతి విజయ్‌, అజిత్‌, సూర్య వంటి టాప్‌ స్టార్స్ కి కూడా సాధ్యం కాని ఘనత ధనుష్‌ సొంతం చేసుకోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది.

ధనుష్‌ అరుదైన ఘనత సాధించారు. తమిళ హీరోల్లో ఆ ఘనత సాధించిన ఏకైక హీరోగా ధనుష్‌ నిలవడం విశేషం. ఆయనకు దేశ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్‌ ఏంటో తాజాగా నిరూపితమైంది. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, దళపతి విజయ్‌, అజిత్‌, సూర్య వంటి టాప్‌ స్టార్స్ కి కూడా సాధ్యం కాని ఘనత ధనుష్‌ సొంతం చేసుకోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది. మరి ఇంతకి ధనుష్‌ సాధించిన ఘనత విషయానికి వస్తే ఆయన సోషల్‌ మీడియాలో ప్రధాన మాధ్యమమైన ట్విట్టర్‌ లో ఆయన పది మిలియన్స్ ఫాలోవర్స్ ని దాటేశారు. 

Massive Milestone !!!🔥 crosses 10M Followers, First hero from Kollywood pic.twitter.com/26kUNjowL7

— VamsiShekar (@UrsVamsiShekar)

2010 జూన్‌లో ఆయన ట్విట్టర్‌లో జాయిన్‌ అయ్యారు. దాదాపు 11ఏళ్ల తర్వాత పది మిలియన్స్ ఫాలోవర్స్ ని చేరుకోవడం ఇప్పుడు హైలైట్‌గా మారింది. అంటే కోటీ మంది ఆయన్ని ఫాలో అవుతున్నారు. తమిళ హీరోల్లో మరే హీరో ఇప్పటి వరకు ఇంతటి ఫాలోవర్స్ ని పొందలేకపోయారు. ఎంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ ఉన్న టాప్‌ స్టార్స్ రజనీ, కమల్‌, విజయ్‌, అజిత్‌, సూర్య, విక్రమ్‌ వంటి హీరోలకు కూడా ఇది సాధ్యం కాలేదు. ధనుష్‌ ఎప్పటికప్పుడు తన సినిమా అప్‌డేట్స్ ని అభిమానులతో పంచుకోవడం, కుదిరినప్పుడు వారితో చాట్‌చేయడంతోపాటు కేవలం తమిళంకే పరిమితం కాకుండా, తెలుగు, హిందీ, హాలీవుడ్‌ వరకు ఆయన సినిమాలు చేస్తుండటంతో ఇంతటి ఘనత సాధ్యమైందని చెప్పొచ్చు. 

ఆయన తర్వాత కమల్‌, సూర్య 6.8 మిలియన్స్ ఫాలోవర్స్ తో ఆ తర్వాత స్థానంలో ఉన్నారు. రజనీకి 5.9 మిలియన్స్  ఫాలోవర్స్ ఉన్నారు. దళపతి విజయ్‌కి కేవలం 3.2 ట్విట్టర్‌ ఫాలోవర్సే ఉండటం గమనార్హం. ఇక ప్రస్తుతం ధనుష్‌ హిందీలో `అట్రాంగి రే`, ఇంగ్లీష్‌లో `ది గ్రే మ్యాన్‌`తోపాటు తమిళంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవల ఆయన `కర్ణన్‌`, `జగమే తంథిరమ్‌` చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.

click me!